ఏపిలో విచిత్రం.. వైసీపి సర్పంచ్ భర్తపై వార్డు మెంబర్ తిరుగుబాటు
అమరావతి/హైదరాబాద్ : అమరావతి గ్రామీణ రాజకీయాల్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అధికార వైసీపీకి చెందిన సర్పంచ్ భర్తపై వార్డ్ మెంబర్ తిరుగుబాటు చేసిన ఘటన రేపల్లె నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, ఉప్పూడి పంచాయతీకి చెందిన 8వ వార్డ్ మెంబర్ రాసిన లేఖ నియోజక వర్గంలో కలకలం సృష్టించింది. సర్పంచ్ భర్త ఇమ్మానియేల్, తనను ఐదు నెలలుగా అవమానిస్తున్నాడని ఆరోపిస్తూ ఉప్పూడి ఎనిమిదో వార్డ్ మెంబర్ పీ.హరీష్ బాబు లేఖలో పేర్కొన్నాడు.
తన భార్యకు డ్వాక్రా యానిమేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఐదు నెలలుగా ఇమ్మానియేల్ తిప్పించకున్నాడని హరీష్ బాబు చెప్తుకొస్తున్నాడు. ఐదు నెలల తర్వాత తనకు బ్యాగ్రౌండ్ లేదని, ఉద్యోగం ఇప్పించే ప్రసక్తే లేదని, సర్పంచ్ భర్త ఇమ్మానియేల్ తనను చులకనగా పరిగణిస్తూ అవమానాలకు గురిచేస్తున్నట్టు దళితుడైన పీ.హరీష్ బాబు బహిరంగ లేఖ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈలేఖ రేపల్లె నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఉప్పూడి సర్పంచ్ దంపతులు పంచాయతీలో అరాచకాలు సృష్టిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మాట వినని వారిపై సర్పంచ్ భర్త తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నట్లు చెప్తున్నారు. తమ మాటను దిక్కరిస్తే, పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు ఆపేస్తామని, ఉపాధి హామీ పనులు నిరాకరించంతో పాటు, డ్వాక్రా గ్రూపుల నుంచి తొలగిస్తామని సర్పంచ్ దంపతులు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గ్రామస్థులు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుత సర్పంచ్ పై గ్రామస్థులు పలు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల కంటే ముందుగానే సర్పంచ్ కు ముగ్గురు సంతానం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి చట్టాన్ని మోసం చేశారని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రేపల్లె కోర్టులో కేసు నడుస్తుందని, చట్టాన్ని మోసం చేస్తూ, గ్రామస్థులను బెదిరించటం ఏంటని ఉప్పూడి పంచాయతీ ప్రజలు సర్పంచ్ దంపతులను ప్రశ్నిస్తున్నారు. జిల్లా నాయకులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications