విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే

విశాఖపట్నంలో వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు నగర పోలీస్ కమీషనర్. ట్రాఫిక్ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించేవారికి షాక్ ఇవ్వటానికి రెడీ అయ్యారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను సమర్ధవంతంగా అరికట్టటంతో పాటు, రోడ్డు ప్రమాదాలనుగణనీయంగా తగ్గించే లక్ష్యంతో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నగర పోలీస్ విభాగానికి అత్యాధునిక స్పీడ్ లేజర్ గన్ లను అందించారు.

విశాఖలో లేజర్ స్పీడ్ గన్ లు

ఈ స్పీడ్ గన్ లు ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే అవి గుర్తించి వెంటనే చలాన్లు జారీచేస్తాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, సుమారు రూ.18లక్షల సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన రెండు స్పీడ్ లేజర్ గన్‌లను పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి అందజేశారు. ఈ పరికరాలు రోడ్డుప్రమాదాలను నివారించడమే కాకుండా, రద్దీప్రాంతాల్లో ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి.

Strict Traffic Enforcement in Visakhapatnam Laser Speed Guns Introduced shock for motorists

నిబంధనలు ఉల్లంఘిస్తే బాదుడే

వాహనదారులు విశాఖలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే వారికి ఈ గన్ లు షాక్ ఇవ్వనున్నాయి.వాహనదారులు అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపినా, హెల్మెట్ ధరించకపోయినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, రాంగ్ రూట్‌లో వెళ్లినా ఇవి గుర్తితాయి. ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, ఈ గన్‌లు 100 మీటర్ల దూరం నుంచే అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తాయి. గుర్తించిన వెంటనే నిబంధనలు ఉల్లంఘించిన వారికి అప్పటికప్పుడే ఆటోమేటిక్‌గా ఈ-చలాన్‌లు జారీ అవుతాయి.

త్వరలో మరో లేజర్ గన్

ఈ ఆధునిక పరికరాలు నగరంలో ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత పటిష్టం చేస్తాయని, ఇకపై వాహనదారులు రూల్స్ కు నో అంటే చలాన్ ల బాదుడు తప్పదని అంటున్నారు నగర పోలీసులు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు స్పీడ్ లేజర్ గన్‌లకు అదనంగా, త్వరలో మూడో గన్ కూడా అందుబాటులోకి రానుందని చెప్పారు. ఈ మూడు గన్‌లను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా అనుసంధానించనున్నారు.

ఏఐ సాయంతో ట్రాఫిక్ నిబంధనలపై రియల్ టైం చలానాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ట్రాఫిక్ ఉల్లంఘనలపై రియల్ టైం చలాన్‌లు జారీ చేయనున్నారు. ఇది నగర ట్రాఫిక్‌ను మరింత సమర్థవంతంగా నియంత్రించడంలో తోడ్పడుతుంది.ఈ పరిణామాల మధ్య, జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్ లిమిటెడ్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద విశాఖ పోలీసుల భద్రతా వ్యవస్థకు 120 సీసీటీవీ కెమెరాలను అందించింది. పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి అందజేసిన ఈ కెమెరాలను తొలి దశలో 44 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి నిరంతరం పర్యవేక్షిస్తామని సీపీ ప్రకటించారు. ఈ సమగ్ర చర్యలు నగర భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+