స్వచ్ఛ భారత్‌లో భాగంగా పరిసరాలు శుభ్రం చేస్తూ కోమాలోకి విద్యార్థి, ఆసుపత్రిలో మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం భీమవరం గ్రామంలో శుక్రవారం ఓ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయిచంద్ (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువ

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం భీమవరం గ్రామంలో శుక్రవారం ఓ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయిచంద్ (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతను గురువారం పాఠశాలకు వెళ్లాడు.

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులతో పరిసరాలను శుభ్రం చేయిస్తోంది. ఈ సమయంలో విద్యార్థి ఓ చెట్టు కొమ్మను లాగాడు. దీంతో అది కూలింది.

Student dies in swacch Bharat mishap in West Godavari

అతనికి గాయాలయ్యాయి. అతనిని వెంటనే ఆకివీడు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అతను కోమాలోకి వెళ్లాడని, అతని బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు వెల్లడించారు. అనంతరం అతను శుక్రవారం సాయంత్రం కన్నుమూశాడు.

విద్యార్థి అంత్యక్రియలు శనివారం జరిగాయి. స్కూల్ యాజమాన్యం అంతిమయాత్రకు హాజరైంది. స్కూల్ యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కొడుకు మరణించాడని తల్లిదండ్రులు కంటతడి పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+