సుప్రీం కోర్టులో విచారణ: బాబును టార్గెట్ చేసిన సుబ్రహ్మణ్యస్వామి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం అంశం పైన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకున్నారు. తిరుమల పైన రాష్ట్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం చెల్లదని ఆయన కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పైన ఏపీ ప్రభుత్వం గుత్తాధిపథ్యం చలాయిస్తుందని, ఇది సరికాదని చెబుతూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీని పైన బుధవారం కోర్టులో విచారణ జరగనుంది.

Also Read: చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన స్వామి: వెనక ఎవరు?

పాలమూరు, డిండి ప్రాజెక్టుల పైన విచారణ

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు, డిండి ప్రాజెక్టుల పైనా సుప్రీంలో బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ రెండు ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Subramanian Swamy targets AP government over TTD issue

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కేంద్రమంత్రి ఉమాభారతి చైర్‌పర్సన్‌, ఇతర రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్‌ కౌన్సిల్‌ దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ మాట్లాడుతూ... పాలమూరు, డిండి సమైక్య రాష్ట్రంలో ఆమోదించిన ప్రాజెక్టులేనన్నారు.

అయితే ఈ రెండు ప్రాజెక్టులు విభజన తర్వాతే ప్రారంభించారని, ఇప్పటివరకు సర్వే చేపట్టలేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా ఇరు రాష్ట్రాలు నూతన ప్రాజెక్టులు చేపట్టరాదని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. పాలమూరు, డిండి డీపీఆర్‌లను ఇంతవరకు సమర్పించలేదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Subramanian Swamy targets AP government over TTD issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి