విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అద్భుతం: 3 గంటల్లోనే సబ్ వే నిర్మాణం, విశాఖ వాసులకు తీరిన కష్టాలు

దశాబ్దాలైనా నగరంలోని రెండు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరకలేదు. అయితే స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. మూడున్నర గంటల్లోనే పనులు పూర్తి చేయించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: దశాబ్దాలైనా నగరంలోని రెండు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరకలేదు. అయితే స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. మూడున్నర గంటల్లోనే పనులు పూర్తి చేయించారు. రాత్రికి రాత్రే ప్లైఓవర్ నిర్మించడంతో ఈ రెండు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించినట్టైంది.

విశాఖపట్టణంలోని రెండు గ్రామాల ప్రజలు తమ ఇళ్ళకు వెళ్ళాలంటే చుట్టూ తిరిగాల్సి వస్తోంది. అర్జంట్ గా ఆసుపత్రికి వెళ్ళాల్సిన వచ్చినా ఇతర సమయాల్లో కూడ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే రామ్మూర్తిపంతులుపేట, గవర కంచరపాలెం గ్రామాల మధ్య ప్రజలు రాకపోకలు సాగించాలంటే సుదూర ప్రాంతం ప్రయాణీంచాల్సి ఉంది.రైల్వే ట్రాక్ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మిస్తే ఈ రెండు గ్రామాల ప్రజల సమస్యలు తీరిపోయేవి. అయితే ఈ సమస్యల పరిష్కారం కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది.

ఈ రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ నిర్మాణం కోసం విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చొరవ తీసుకొన్నారు. గణబాబు చొరవతో ఈ రెండు గ్రామాల ప్రజల సమస్యలు తీరాయ ి.

అసలు సమస్య ఏమిటంటే?

అసలు సమస్య ఏమిటంటే?

రామ్మూర్తిపంతులుపేట, గవర కంచరపాలెం గ్రామాల ప్రజలు అటు నుండి ఇటు నుండి అటు రాకపోకలు సాగించాలంటే మధ్యలో రైల్వే క్రాసింగ్ గేటు ఉంది. ఈ మార్గంలో రైళ్ళు 24 గంటలపాటు తిరుగుతాయి.దీంతో ఈ గేటను 24 గంటలపాటు మూసే ఉంచుతారు.ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు.రామ్మూర్తిపంతులపేట వద్ద ఫ్లైఓవర్ నిర్మించారు.అయితే దాని వల్ల ప్రయోజనం లేకుండాపోయింది.సబ్ వే నిర్మిస్తే సమస్యకు పరిష్కారం అవుతోందని అధికారులు తేల్చారు. దీంతో రైల్వేశాఖాధికారులతో ఎమ్మెల్యే గణబాబు చర్చించారు. తన నిధుల నుండి రూ.3 కోట్ల ఇస్తూ రైల్వే శాఖకు లేక ఇచ్చారు.

సబ్ వే పనుల నిర్మాణానికి శ్రీకారం

సబ్ వే పనుల నిర్మాణానికి శ్రీకారం

ఈ రెండు గ్రామాల ప్రజల సమస్య పరిష్కారం కావాలంటే సబ్ వే నిర్మాణం చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.అయితే సబ్ వే నిర్మాణాన్ని రాత్రికి రాత్రే చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. రైలు పట్టాలు తొలగించి రైళ్ళ రాకపోకలను నిలిపివేసి పనులు చేస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు భావించారు.అయితే ప్రీప్యాబ్రికేటేడ్ పద్దతిలో నిర్మాణాన్ని చేపట్టారు. సబ్ వే కు అవసరమైన టన్నెల్ ప్రేములను ముందుగానే తయారుచేసి పెట్టుకొన్నారు.మంగళవారం ఉదయం నుండి రైలు పట్టాల కింద నుండి సొరంగం పనులను తవ్వారు.తెల్లవారేసరికి సబ్ వే పనులకు పూర్తి చేశారు. దీని 20 వేల మందికి ఉపయోగపడుతోంది.రాయగడ- విజయనగరం, విశాఖ- పలాస ప్రధాన లైనులో రామ్మూర్తి పంతులపేట గేటు వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ సబ్ వే పనులు మొదలయ్యాయి.

మూడున్నర గంటల్లో పనులు పూర్తి

మూడున్నర గంటల్లో పనులు పూర్తి

అత్యాధునిక సాంకేతిక పరికరాలతో చేపట్టిన ఈ పనులను సుమారు మూడున్నర గంటల్లో పూర్తిచేయనున్నట్టు తెలిపింది. మంగళవారం రాత్రి ఎల్ టీ డీ ఎక్స్ ప్రెస్ వెళ్ళాక పనులను ప్రారంభించారు. బుదవారం తెల్లవారుజామున 3.50 నిమిషాలకు పూర్తిచేసే విధంగా జాగ్రత్తలు తీసుకొన్నారు. విద్యుత్ దీపాల వెలుగులో అవసరమైన మేరకు ట్రాక్ ను తొలగించడం, నిర్మాణం పూర్తైన తర్వాత ట్రాక్ పునరుద్దరణ చకచకా చేపట్టారు. ముందుగానే సాంకేతిక పరికరాలు, ప్రొక్లెయినర్లతో పాటు టిప్పర్లను సిమెంట్ బ్లాక్ లను సిద్దం చేసుకొన్నారు. ముందుగా కొలతల ప్రకారం సిద్దం చేసుకొన్న బ్లాక్ లను అత్యాధునిక సాంకేతిక పరికరాలతో అమర్చారు. బ్లాక్ లను అమర్చిన తర్వాత ట్రాక్ ను పునరుద్దరించారు.

రైళ్ళ రీ షెడ్యూల్

రైళ్ళ రీ షెడ్యూల్

రాయగడ- విజయనగరం, విశాఖ- పలాస ప్రధాన లైనులో పరిమిత ఎత్తులో సబ్ వే పనులు వచ్చే నెల 15వ, తేది వరకు జరుగుతాయి. అయితే అప్పుడప్పుడు రైళ్ళ రాకపోకలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆయా తేదిల్లో నడిచే రైళ్ళను రీ షెడ్యూల్ చేయనున్నారు.మరికొన్ని రైళ్ళను రద్దు చేసే అవకాశం ఉంది. మరికొన్ని రైళ్ళను గమ్యాన్ని కుదించి పాక్షికంగా రద్దు చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

English summary
Subway constructed within three hours at Kancharapalem in Visakhapatnam district on Tuesday.It is comfortable to two villages, Visakhapatnam west MLA Ganababu released Rs.3 crores for subway .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X