వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు సక్సెస్ సీక్రెట్స్ - 72 ఇయర్స్ యంగ్ మ్యాన్ : ఫుడ్ టు పీపుల్ వరకూ...!!

|
Google Oneindia TeluguNews

చంద్రబాబు నాయుడు. టీడీపీ అధినేత. అత్యధిక కాలం సీఎంగా పని చేసిన ఘనత. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకొనే నైపుణ్యం ఉన్న నేత. రాజకీయంగా సుదీర్ఘ నేపథ్యం ఉన్న ఆయనకు జాతీయ - రాష్ట్ర స్థాయిలో పార్టీలకు అతీతంగా ఎంతో మంది మిత్రులు..సహచరులు ఉన్నారు. ఆయన నాయకత్వంలో పని చేసిన ఎంతో మంది ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నా కీలక స్థానాలో కొనసాగుతున్నారు. రాజకీయంగా చంద్రబాబును విమర్శించే వారు సైతం..ఆయన ఆరోగ్యం - ఆహార్యం - క్రమశిక్షణ విషయంలో అభినందించకుండా ఉండలేరు. చంద్రబాబు వయసు ఇప్పుడు 72. కానీ, ఆయన 27 ఏళ్ల యువకుడిలా సమావేశాలు.. పార్టీ వ్యవహారాలు..రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటారు. అర్ద్రరాత్రి వరకు ఆయన ఎక్కడా అలుపు లేకుండా నిరంతరం పని చేస్తుంటారు.

చంద్రబాబు ఫిట్ నెస్ మంత్ర..

చంద్రబాబు ఫిట్ నెస్ మంత్ర..

ఎప్పుడూ ఆరోగ్యంగా ..ఉత్తేజంగా ఉండటం అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో..అసలు ఈ వయసులోనూ చంద్రబాబు ఏం ఆహారం తీసుకుంటారు.. ఏ విధంగా రోజు వారీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.. ఆయన పాటించే ఫిట్ నెస్ మంత్ర.. సక్సెస్ కు కారణం ఏంటనే ఆసక్తి చాలా మందిలో ఉంది. చంద్రబాబు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే..అది పూర్తి చేసే దాకా విశ్రమించని నైజం తొలి నుంచి ఉంది. ఎన్టీఆర్ పార్టీ అధినేతగా - సీఎంగా ఉన్న సమయంలో ఆయన తెల్ల వారు జామున 3 గంటల నుంచే లేచి తన దిన చర్య ప్రారంభించేవారు. ఆయన ముందుకు చంద్రబాబు 5 గంటలకే హాజరయ్యే వారు. అయితే, చంద్రబాబు ధ్యానం..శ్వాసక్రియను క్రమం తప్పకుండా పాటిస్తారు. ఎక్కడ ఉన్నా..చంద్రబాబు ఉదయం 5.00 నిమిషాల‌కి శ్వాస‌క్రియ‌కి సంబంధించిన వ్యాయామం, యోగా చేయటం తో దిన చర్చ ప్రారంభం అవుతుంది.

మెడిటేషన్ .. పరిమిత ఆహారం

మెడిటేషన్ .. పరిమిత ఆహారం

ఉదయం 5.30 నిమిషాల‌కు మెడిటేష‌న్ మొద‌లు పెట్టి 6 గంట‌ల లోపే పూర్తి చేస్తారు. 6 గంట‌ల నుంచి 7 గంట‌ల వ‌ర‌కూ ట్రెడ్‌మిల్‌.. స్విమ్మింగ్‌.. చిన్న‌పాటి వ్యాయామాలు చేస్తారు. 7.15 నిమిషాల‌కు ఠంచ‌న్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటారు. అందులో రెండు ఇడ్లీ విత్ సాంబార్‌, ఆయిల్ లేకుండా ఒక దోశ వీటితోపాటు న‌ట్స్‌/డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇక, ఒక వైపు నిర్దేశించిన అప్పాయింట్ మెంట్స్.. కార్యక్రమాలు...చర్చలు కొనసాగిస్తూనే.. ఉద‌యం ప‌ది గంట‌ల‌కి స్నాక్స్‌లా కొద్దిగా న‌ట్స్‌/డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. ఏ సమావేశంలో ఉన్నా.. ప్రయాణంలో అయినా.. 12.15 నిమిషాల‌కు ఠంచ‌న్‌గా లంచ్‌..2 పుల్కాలు విత్ వెజిట‌బుల్స్‌, కొద్దిగా రైస్‌ తీసుకుంటారు. తరువాత విశ్రాంతి తీసుకోకుండానే తన పనిలో నిమగ్నం అయిపోతారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు బ్లాక్ కాఫీ తీసుకుంటారు. మధ్నాహ్నం తరువాత నుంచి విజిటర్స్ కు అప్పాయింట్ మెంట్లు.. ముఖ్యులతో సమావేశాలకు సమయం కేటాయిస్తారు. ఇక, సాయంత్రం 5.30 నుంచి 6 గంట‌ల మ‌ధ్య‌లో వెజిట‌బుల్ స‌లాడ్ లేదా ఫ్రూట్ స‌లాడ్ తీసుకుంటారు.

లంచ్ - డిన్నర్ ఇలా..

లంచ్ - డిన్నర్ ఇలా..

ఆ తరువాత తనను కలవటానికి వచ్చిన వారితో సమావేశాలు నిర్వహిస్తారు. ఎదుటివారు చెప్పంది వినే స్వభావం ఉన్న చంద్రబాబు..విన్న తరువాత తన అభిప్రాయం ఏంటనేది నిర్ణయిస్తారు. రాత్రి సమయంలో ఆయన ఆహారం తొందరగా ముగిస్తారు. రాత్రి 7.30 నిమిషాల‌కు 2 పుల్కాలు విత్ వెజిట‌బుల్స్‌, న‌ట్స్‌, బోయిల్డ్ ఎగ్‌తో ఆయన డిన్నర్ పూర్తవుతుంది. ఇక, స్నాక్స్‌లో న‌ట్స్‌-డ్రైఫ్రూట్స్‌యే కాకుండా మిల్లెట్స్‌, ఫ్రూట్స్, బోయిల్డ్ ఎగ్ ఉంటుంటాయి. లంచ్‌, డిన్న‌ర్‌లో చిన్న‌బౌల్ రైస్ స్థానంలో ఇష్ట‌మైన రాగి సంగ‌టి ని చేర్చుతారు. సీజ‌న‌ల్ ఫ్రూట్స్ అన్నీ ఇష్టంగా తీసుకున్నా.. పరిమితి మేరకే తింటారు. నాన్ వెజ్ ఇష్ట‌మైనా.. క్ర‌మ‌ప‌ద్ధ‌తి అయిన ఆహార‌విధానంలో దూరంగానే ఉంటున్నారు. ఉద‌యం నుంచి రాత్రి నిద్ర‌పోయే వ‌ర‌కూ తీసుకునే ఆహారప‌దార్థాలు ఎంత ఇష్ట‌మైన‌వైనా వాటిని ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు.

క్రమశిక్షణ .. ఒత్తిడిని జయిస్తూ

క్రమశిక్షణ .. ఒత్తిడిని జయిస్తూ

సమయం - పరిమాణం లో మాత్రం మార్పు ఉండదు. వ్యాయామం.. నిద్ర..ఆహారంలో పరిమితులు ఆయన ఆరోగ్య రహస్యాలు. 72 ఏళ్ల వయసులోనూ వరుస పర్యటనలు..సమావేశాలు ఉన్నా అలుపు లేకుండా ఎప్పుడూ ఎనర్జిక్ గా కనిపించటం వెనుక ఇదే అసలు కారణం. ఇక, ఎంతంటి సమస్యకు అయినా పరిష్కారం ఉందనే విధంగా పాజిటివ్ ఆలోచనతో ఒత్తిడిని దగ్గరకు రానీయరు. వీటన్నింటిని పాటిస్తూ..అన్నింటి కంటే మరో ముఖ్యమైన క్రమశిక్షణ విషయంలో రాజీ లేకుండా సాగటం వలనే ఒంటి చేత్తో పార్టీని ఇంత కాలం..ఇన్ని సమస్యలు - సంక్షోభాలు ఎదురైనా తన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. ఇదే..ఇప్పుడు ఆయన 72 ఏళ్ల వయసులోనూ 27 ఏళ్ల యంగ్ మ్యాన్ గా మార్చుతున్న రహస్యం.

English summary
TDP Chief Chandrababu looks very energetic at the age of 72 because of his diet and fitness mantra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X