Idupulapaya సీఎం జగన్ షెడ్యూల్ లో సడెన ఛేంజ్ : షర్మిల రాక యతాతధం..అదే కారణమా..!!

ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటనలో ఆకస్మిక మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ 7వ తేదీన కడప చేరుకొని ఇడుపులపాయలో ఉంటారని.. మరుసటి రోజు ఉదయం వైఎస్సార్ ఘాట్ లో నివాళి అర్పించేలా షెడ్యూల్ తొలుత ఖరారైంది. దీంతో..అదే రోజు అదే బెంగుళూరు నుండి షర్మిల సైతం ఇడుపుల పాయకు వచ్చి తండ్రి సమాధి వద్ద ప్రార్ధనలు చేసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తారని ఆమె సన్నిహితులు ఇప్పటికే వెల్లడించారు. ఆ తరువాత షర్మిల హైదరాబాద్ లో తన కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారు.

అన్నా - చెల్లెలు కలుస్తారంటూ..

అన్నా - చెల్లెలు కలుస్తారంటూ..

దీంతో..జగన్ - షర్మిల తండ్రి ఘాట్ వద్ద కలుసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి టూర్ షెడ్యూల్ లో మార్పులు చేస్తూ కడప జిల్లా యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కడప జిల్లా పర్యటన రెండు రోజులకు కుదించారు. 8వ తేదీ ఉదయం సీఎం జగన్ గన్నవరం నుండి బయల్దేరి..పుట్టపర్తి విమానాశ్రయం చేరుకొని అక్కడ నుండి హెలికాఫ్టర్ లో రాయదుర్గం వెళ్లనున్నారు. అక్కడ జరిగే రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా అధికారులు చెబుతున్నారు. మధ్నాహ్నం అనంతపురం జిల్లా నుండి పులివెందుల చేరుకుంటారు.

సాయంత్రం వైఎస్సార్ కు నివాళి..

సాయంత్రం వైఎస్సార్ కు నివాళి..

సాయంత్రం 4 గంటలకు ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద దాదాపు 45 నిమిషాలు నివాళి కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా అధికారుల నుండి సమాచారం అందుతోంది. ఆ రోజు అక్కడే బస చేసి మరుసటి రోజు 9వ తేదీ సైతం కడప జిల్లా బద్వేలులో పర్యటిస్తారు. అయితే, ప్రతీ సారి ఉదయం సమయంలోనే వైఎస్సార్ కు నివాళి అర్పించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఇప్పుడు సీఎం జగన్ సాయంత్రానికి ఆ కార్యక్రమం మార్చుకున్నారనే సమాచారంతో అనేక రక రకాలుగా చర్చలు సాగుతున్నాయి.

Recommended Video

    Megastar Chiranjeevi చిక్కుతారా.. చిక్కుల్లో పెడతారా.. ఈసారి ఆచితూచి..!!
    ఈ సమయంలో సోదరితో కలిస్తే..

    ఈ సమయంలో సోదరితో కలిస్తే..


    సోదరి షర్మిల ఉదయం సమయంలో వైఎస్సార్ ఘాట్ కు వస్తుండటంతోనే ముఖ్యమంత్రి కార్యక్రమం మధ్నాహ్నానికి వాయిదా పడిందా అనే చర్చ జరుగుతోంది. ఏపీ- తెలంగాణ మధ్య నీటి వివాదం సాగుతున్న సమయంలో షర్మిల తెలంగాణకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరిక చేసారు. ఈ సమయంలో షర్మిలతో కలిస్తే కొత్త విమర్శలు చుట్టు ముట్టే అవకాశం ఉండటంతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు.అయితే, జిల్లా అధికారులు మాత్రం తమకు ముఖ్యమంత్రి పర్యటన గురించి సమాచారం మాత్రమే ఇచ్చారని చెబుతున్నారు. మరి..వైసీపీ నేతలు దీని పైన ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+