ఏపీ మంత్రుల రాజీనామాలు..!! నేడే గవర్నర్ తో సీఎం జగన్ భేటీ : కేబినెట్ ప్రక్షాళనలో మార్పు..!!

ఏపీ కేబినెట్ మొత్తాన్ని ఒకే సారి తప్పించేందుకు రంగం సిద్దమైంది. అందరి మంత్రులు రాజీనామా చేయనున్నారు. కొత్త మంత్రివర్గ విస్తరణ వేళ..అందరితో రాజీనామా చేయించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాలతో వేగంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ.. పాలనా పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్..ఆ వెంటనే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ప్రధానితో సుదీర్ఘ మంతనాలు చేసారు.

ఢిల్లీ నుంచి రాగానే గవర్నర్ వద్దకు

ఢిల్లీ నుంచి రాగానే గవర్నర్ వద్దకు

ఏపీ పరిస్థితులతో పాటుగా రాజకీయ అంశాల పైన చర్చించినట్లు సమాచారం. ఇక, ఆ వెంటనే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్.. గజేంద్ర షెకావత్.. హోం మంత్రి అమిత్ షా తోనూ భేటీ అయ్యారు. ఈ రోజున మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. ఆ తరువాత అమరావతికి చేరుకోనున్న సీఎం జగన్... ఈ సాయంత్రం గవర్నర్ తో భేటీకి అప్పాయింట్ మెంట్ ఖరారైంది. సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ కానున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7వ తేదీన కేబినెట్ సమావేశం..ఆ తరువాత మంత్రుల రాజీనామా లేఖలు తీసుకుంటారని అధికార పార్టీలో ప్రచారం సాగింది. ఇక, ఈ నెల 8వ తేదీన గవర్నర్ తో సీఎం జగన్ భేటీ అయ్యేలా ముందుగా కార్యాచరణ సిద్దమైంది.

మంత్రులు అందరితో రాజీనామాలు

మంత్రులు అందరితో రాజీనామాలు


ఈ నెల 11వ తేదీన కేబినెట్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కానీ, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనతో షెడ్యూల్ మారింది. ఈ రోజున సీఎం జగన్ నర్సరావు పేట పర్యటన రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం జరగాల్సిన కేబినెట్ సమావేశం రేపు మధ్నాహ్నానికి నిర్ణయించారు. అయితే, ఈ రోజునే మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుంటారని చెబుతున్నారు. కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం సైతం ముందుకు జరిగిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే.. ఈ సాయంత్రమే గవర్నర్ తో సీఎం భేటీ కానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, అధికార వర్గాలు మాత్రం 11నే కేబినెట్ విస్తరణ అని చెబుతున్నారు. ఈ రోజు గవర్నర్ ను సీఎం జగన్ కలిసిన సమయంలో జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రధానమంత్రి మోదీతో తాజాగా జరిగిన భేటీ తదితర అంశాలపై సీఎం చర్చిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం పైనా

కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం పైనా


అయితే, మంత్రులతో ఈ రోజే రాజీనామా లేఖలు తీసుకుంటారని పార్టీలోని అత్యంత ముఖ్యులు చెబుతున్న సమాచారం. రేపు (7వ తేదీ) విస్తరణ కు చివరి నిమిషంలో నిర్ణయించి.. ఏర్పాట్లు చేయాలని డిసైడ్ అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో..పర్యటన ముగించి..అమరావతికి తిరిగి వచ్చే సమయంలో ఈ వ్యవహారం పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ నెల 7వ తేదీ లేకుంటే 11వ తేదీన కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తంగా చర్చ జరిగింది. కానీ, సీఎం సడన్ గా గవర్నర్ తో భేటీ కానుండటం.. మంత్రులతో ఈ రోజే రాజీనామాలు తీసుకుంటారనే ప్రచారం సాగుతుండటంతో కొత్త చర్చకు ఆస్కారం ఏర్పడింది.

సీఎం జగన్ నిర్ణయాలపై ఉత్కంఠ

సీఎం జగన్ నిర్ణయాలపై ఉత్కంఠ


దీంతో.. ప్రస్తుతం ఉన్న మంత్రులు మాత్రం ఈ రోజు కాకుంటే రేపు అయినా రాజీనామా చేయాల్సిందేనంటూ సిద్దపడుతుండగా.. మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో మాత్రం ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో అందరితోనూ రాజీనామాలు చేయించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత కేబినెట్ లో ఉన్న వారిలో ముగ్గురు తిరిగి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. శ్రీకాకుళం..తూర్పు గోదావరి.. కర్నూలు జిల్లాకు చెందిన ఈ మంత్రులు తిరిగి కొత్త కేబినెట్ లోనూ కొనసాగనున్నట్లు సమాచారం. అయితే, సీఎం జగన్ నిర్ణయాలు చివరి నిమిషం లో ఎలా ఉంటాయో అనే ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతోంది. దీంతో..రాజకీయంగా ప్రభుత్వం.. వైసీపీ లోనూ ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+