టిటిడి సభ్యురాలిగా సుధామూర్తి ప్రమాణం, శేఖర్ రెడ్డి స్థానంలో సుధామూర్తి నియామకం

సామాజిక కార్యకర్త సుధామూర్తి ఆదివారం నాడు టిటిడి సభ్యురాలిగా ప్రమాణం చేశారు.తిరుమల దేవాలయంలో టిటిడి ఈవో సాంబశివరావు సుధామూర్తితో టిటిడి సభ్యురాలిగా ప్రమాణం చేయించారు.

తిరుమల:సామాజిక కార్యకర్త సుధామూర్తి ఆదివారం నాడు టిటిడి సభ్యురాలిగా ప్రమాణం చేశారు.తిరుమల దేవాలయంలో టిటిడి ఈవో సాంబశివరావు సుధామూర్తితో టిటిడి సభ్యురాలిగా ప్రమాణం చేయించారు.

చెన్నైలో ఇటీవల ఆదాయపుపన్నుశాఖ అరెస్టు చేసిన శేఖర్ రెడ్డిని టిటిడి సభ్యుడిగా తొలగించారు. దీంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో సుధామూర్తిని నియమిస్తూ ఎపి సర్కార్ నిర్ణయం తీసుకొంది.

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొన్న అనంతరం ఆమె టిటిడి సభ్యురాలిగా బాధ్యతలను స్వీకరించారు.

Sudha Murthy takes oath as TTD member

స్వామి వారి దర్శనం చేసుకొన్న తర్వాత ఆమెకు తీర్థప్రసాదాలను అందించారు.అంతేకాదు స్వామి వారి ఫోటోను కూడ దేవాలయాధికారులు బహుకరించారు.

తనకు భగవంతుడికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఆమె దేవస్థాన బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు. ఆరు దశాబ్దాల తర్వాత తిరుమలను తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొన్నట్టుగా ఆమె తెలిపారు.

చెన్నైకు చెందిన శేఖర్ రెడ్డి జయలలిత మరణం తర్వాత ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తే భారీగా నగదు, బంగారం ఆయన నుండి అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ పరిణామాలతో శేఖర్ రెడ్డిని టిటిడి సభ్యుడిగా బాధ్యతల నుండి తప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+