టీటీడీ ఛైర్మన్‌గా సుధాకర్ యాదవ్?: పండగ తర్వాతే నియామకం

Subscribe to Oneindia Telugu

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకవర్గ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌యాదవ్‌ నియామకం దాదాపు ఖరారైంది. పాలక మండలి సభ్యుల నియామకంపైనా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మిత్ర పక్షం బీజేపీ సూచించిన ముగ్గురు సభ్యులకు పాలకవర్గంలో చోటు లభించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నియామక ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభించింది. సంక్రాంతి తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం.

Sudhakar Yadav likely to be new Tirumala Tirupati Devasthanams chairman

కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత సుధాకర్‌యాదవ్‌ను టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని మూడు నెలల క్రితమే ప్రభుత్వం నిర్ణయించినా.. పలు కారణాలతో ఆలస్యమైంది.

కాగా, టీటీడీ ఛైర్మన్ పదవి కోసం పోటీ ఎక్కువగా ఉండటంతోనే నియామకం ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. అంతేగాక, సుధాకర్‌యాదవ్‌ క్రైస్తవ కూటమిలో పాల్గొన్నారన్న విమర్శలు రావడంతో.. ప్రభుత్వం పరిశీలన చేపట్టింది. ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధరణకు వచ్చాక తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The state government is more or less decided on appointing Kadapa TDP leader Putta Sudhakar Yadav as chairman of the Tirumala Tirupati Devasthanams (TTD) Trust Board.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X