వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాని ఆపిన రైలు: రాములమ్మ డుమ్మా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ సక్సెస్ అయిందని కాంగ్రెసు పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు.

ఆమె సభలకు తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చారు. సోనియా తన ప్రసంగాన్ని ముగించి బయలుదేరిన తర్వాత కూడా చాలాసేపు చుట్టు పక్కల రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి.

చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పి కార్తీక్ రెడ్డిని, ఆ నియోజకవర్గం పరిథిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల పార్టీ అభ్యర్థులను ఆమె సభికులకు పరిచయం చేశారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

సోనియా గాంధీ చేవెళ్ల సభలో అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు నమస్కారాలు.. అంటూ తెలుగులో అనడంతో సభికులు కేరింతలు కొట్టారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

సోనియా గాంధీ సభా ప్రాంగణానికి రావడానికి రెండు గంటల ముందు గాలి, దుమారం, తేలికపాటి వర్షం రావడంతో సభకు ఆటంకం కలుగుతుందని పార్ట నాయకులు భయపడ్డారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

కానీ గంట తర్వాత మబ్బులు చెదిరి పోయి ఎండ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సోనియా రాక సందర్భంగా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర సమితి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నదని తూర్పారబట్టారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

ప్రజలు జాగురుకతతో ఓట్లు వేయాలని, కొత్త రాష్ట్రం ఏర్పాటవుతున్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, బంగారు తెలంగాణ కావాలన్న ప్రజల ఆకాంక్ష సాకారమవుతుందని ఆమె అన్నారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అడ్డుపడ్డాయని ఆమె దుయ్యబట్టారు. ఆ పార్టీలు మాట మార్చినా, తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ హోం మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కూడా ప్రసంగించారు. ఎఐసిసి నాయకులు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్, వాయలార్ రవి, పొన్నాల, సబిత ప్రభృతులు సోనియాకు స్వాగతం పలికారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

కెసిఆర్ దోకా చేశారని, తెలంగాణ విషయంలో మాకు ఇచ్చిన మాటపై నిలబడలేదని, తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో ఆయన లేరని సోనియా అన్నారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

కెసిఆర్‌లాంటి అనైతిక వ్యక్తుల చేతుల్లో అధికారాన్ని పెట్టొద్దన్నారు. అలాచేస్తే, ప్రజలకు ఇబ్బందులేనని ఆమె ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

హైదరాబాద్ ఆదాయమంతా తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని ప్రకటించారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తుని అందించేందుకు కాంగ్రెస్ పార్టీ వద్ద రూ.40 వేల కోట్లు విలువైన బృహత్తర ప్రణాళిక ఉన్నదన్న ఆమె, కొత్త రాష్ట్రంలో తొలి అవకాశం తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

తెలంగాణ ఏర్పాటుకు తెరాస చేసింది సున్నా అంటూ గత తెలంగాణ పర్యటనలో తెగేసి చెప్పిన సోనియా.. ఈసారి మరింత తీవ్రంగా కెసిఆర్‌పై కన్నెర్ర చేశారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

ఎన్నో కష్టనష్టాలకు వోర్చి, చివరకు పార్టీ నష్టపోతున్నా లెక్కచేయకుండా తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చినట్టు సోనియా గాంధీ చెప్పారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

సోనియా హాజరైన చౌటకూర్ సభకు ఆ పార్టీకి చెందిన అసెంబ్లీ అభ్యర్థులు ఎం విజయశాంతి (మెదక్), జగ్గారెడ్డి (సంగారెడ్డి), టి నందీశ్వర్‌గౌడ్ (పటాన్‌చెరు)లు హాజరు కాలేదు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

మరోవైపు, సోనియా ప్రయాణం చేయాల్సిన హెలికాప్టర్ మొరాయించింది. ఆదివారం చేవెళ్లలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని అందోల్‌కు వెళ్లాలనుకున్న ఆమె.. ప్రైవేటు హెలికాప్టర్‌లో ఎక్కి కూర్చున్నారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

అది కొద్దిగా పైకి లేచిన తర్వాత ఇంజన్‌లో సమస్య రావడంతో కిందికి దిగిపోయింది. దాన్ని బాగు చేసేందుకు ప్రయత్నించిన పైలట్ కొద్దిసేపటి తర్వాత చేతులెత్తేశారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

వెనకాలే ఉన్న ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ పైలట్, సిబ్బంది తమ హెలికాప్టర్‌లో రావాల్సిందిగా ఆమెను కోరారు. కానీ, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున వైమానిక దళ వాహనంలో ప్రయాణం చేసేందుకు ఆమె ససేమిరా అన్నారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

దీంతో, పార్టీ నాయకులు ఆమెను రోడ్డు మార్గంలోనే ఆందోల్‌కు తీసుకువెళ్లేందుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సిద్ధం చేశారు. ఆమె వెంట దిగ్విజయ్ సింగ్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు వెళ్లారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

రోడ్డు మార్గంలోనూ ఆమెకు అవాంతరాలు ఎదురయ్యాయి. పోలీసు అధికార యంత్రాంగం మొత్తం సోనియా సభ బందోబస్తులో ఉండడంతో ఆమె వెళ్లే రోడ్డును క్లియర్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

చేవెళ్ల సభ అనంతరం జనమంతా రోడ్డుమీదకు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. జనసమూహాన్ని దాటుకుని శంకరపల్లి వెళ్లగానే అక్కడ రైల్ గేట్ పడింది. దీంతో సోనియా అయిదునిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఒక దశలో పోలీసులు గేటు ఎత్తివేసేందుకు యత్నించగా.. సోనియా వారిని వారించారు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న సోనియా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి చేవెళ్లకు హెలికాప్టర్‌లో వచ్చేందుకూ కొద్దిపాటి ఇబ్బంది తలెత్తింది. ప్రైవేట్ చాపర్‌కు ఎటిసి నుంచి వాతావరణ క్లియరెన్స్ రాలేదు.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

దాదాపు పది నిమిషాలు వేచి చూసిన సోనియా బృందం.. రోడ్డు మార్గంలోనే చేవెళ్లకు చేరాలని నిర్ణయించారు. కానీ, అంతలోనే.. వాతావరణం బాగుందంటూ ఎటిసి క్లియరెన్స్ రావడంతో ఆమె హెలికాప్టర్‌లో చేవెళ్ల వచ్చారు.

English summary
Congress president Sonia Gandhi appealed to voters in Telangana to credit her party for staying true to statehood for the region in the face of political losses due to the decision to bifurcate Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X