సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారు, కానీ.: పవన్ కళ్యాణ్‌కి సుగాలి ప్రీతి తల్లి పార్వతి
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సుగాలి ప్రీతి తల్లి పార్వతి తన కుటుంబసభ్యులతో కలిసి కలిశారు. సుగాలి హత్యాచారం కేసును సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారు కానీ.. సీబీఐ వరకూ వెళ్లలేని డిప్యూటీ సీఎంకు తెలిపారు. దీంతో ఈ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి హామీ ఇచ్చారు.
'మా అమ్మాయి సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు' అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి వినతి పత్రం అందించారు.

మంగళవారం సాయంత్రం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్‌ని తన కుటుంబంతో కలసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు.
సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారుగానీ... ముందుకు తీసుకువెళ్లలేదు
— JanaSena Party (@JanaSenaParty) July 30, 2024
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కలసి వినతి పత్రం అందించిన సుగాలీ ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి pic.twitter.com/ZmbIuKchk2
ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి పోరాడుతూనే ఉన్నారనీ, ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని తెలిపారు.
పవన్‌తో యూఎస్ కాన్సులేట్ భేటీ
అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. జెన్నిఫర్ లార్సన్ను, ఆమె బృందాన్ని పవన్ కల్యాణ్ సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యుఎస్ కాన్సులేట్ జనరల్
— JanaSena Party (@JanaSenaParty) July 30, 2024
అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్ర, సులభతరమైన వీసా విధానం, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.@USCGHyderabad@USAndHyderabad pic.twitter.com/LqRO9MvKoA
పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందనీ, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు. పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications