ఏపీలోనే కాదు.. కేరళ, తమిళనాడులకు వెళ్లండి: సుజనా, అశోక్‌లకు బిజెపి
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ లేదా ప్రధాని మోడీ సూచనల మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు ఇతర రాష్ట్రాలలో పర్యటించనున్నారు. కేంద్రమంత్రులు సొంత రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాలలోను పర్యటించాలని బిజెపి సూచించింది.
తమిళనాడులోను కృష్ణగిరిలో, కర్నాటకలోని కోలార్‌లో పర్యటించాలనీ సుజనా చౌదరికి, కేరళలోని కోజికోడ్, తమిళనాడులోని తిరుచిరాపల్లిల్లో పర్యటించాలని అశోక్ గజపతి రాజులకు భారతీయ జనతా పార్టీ సూచించింది.

కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వంలోని బిజెపి, మిత్రపక్షాల మంత్రులు సొంత రాష్ట్రాలకు కాకుండా భారత్ కోసం పని చేస్తున్నారనే సందేశాన్ని వ్యాప్తి చేయాలని ప్రధాని మోడీ కసరత్తు చేస్తున్నారు.
తమ సొంత రాష్ట్రాలకు బయటి వైపు రెండు ప్రదేశాల్లోనైనా పర్యటించాలంటూ బిజెపి పార్లమెంటరీ పార్టీ తొలిసారిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులకు సూచించింది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపు బయటి రాష్ట్ర పర్యటన పూర్తి చేయాలని కోరింది.












Click it and Unblock the Notifications