తెచ్చి చూపిస్తాం!: ప్రత్యేక హోదాపై సుజన చౌదరిది అదే మాట
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి సోమవారం నాడు పునరుద్ఘాటించారు.
విజయవాడ: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి సోమవారం నాడు పునరుద్ఘాటించారు. ఏపీకి చట్టప్రకారం రావాల్సిన వాటిని అన్నింటిని సాధిస్తామని చెప్పారు. ఏపీ ప్యాకేజీకి 15 రోజుల్లో చట్టబద్ధత వస్తుందని చెప్పారు.
చట్టబద్ధత తప్పకుండా వచ్చి తీరుతుందన్నారు. దానిని ఎట్టి పరిస్థితుల్లో తెచ్చి తీరుతామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. పోలవరంపై చెప్పి తెచ్చామని, హోదా కూడా తెచ్చి చూపిస్తామన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏదో అడిగితే మేం చెప్పలేమన్నారు. మావి మేము చెబుతామని, వాళ్లవి వాళ్లని అడగండని చెప్పారు.
అంతకుముందు, టిడిపి పార్లమెటరీ పార్టీ సమావేశం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. రేపట్నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications