ఈడీ ఎదుట హాజరైన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, 5 గంటల పాటు విచారణ
చెన్నై/విజయవాడ: కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి సోమవారం చెన్నైలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఎదుట హాజరయ్యారు. బ్యాంకులకూ రూ.5700 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆయనను ఈడీ అధికారులు దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. కేసుకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులు ప్రశ్నించారు.
ఇటీవల బ్యాంకుల ఫిర్యాదు నేపథ్యంలో సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. 120కి పైగా కంపెనీలు ఉన్నట్లుగా గుర్తించారు.

బ్యాంకులకు ఆరువేల కోట్ల రూపాయలు బాకీపడి, వాటిని తీర్చడం లేదని సుజనా చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోదాల అనంతరం తమ ఎదుట హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ సమన్లను రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. డిసెంబర్ 3వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. దీంతో సుజనా చౌదరి ఈ రోజు (డిసెంబర్ 3) ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications