కృష్ణాను ఆదర్శ జిల్లాగా, ధరలు పెరుగుదలపై: సుజనా
విజయవాడ: కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతానని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. జిల్లాలో తాను దత్తత తీసుకున్న వీరులపాడు మండలం, పొన్నవరంలో ఆయన ఈరోజు పర్యటించారు. గ్రామంలో తాగునీటి ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాలో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ సంక్లిష్ట పరిస్ధితిలో ఉన్నమాట వాస్తమేనని చెప్పారు. ద్రవ్యోల్బణం కారణంగానే ధరలు పెంచాల్సి వస్తోందని, ప్రజలు అర్ధం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. శాస్త్ర, సాంకేతిక రంగాల సంస్ధలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

చెరకు రైతుల ధర్నాకు మద్దతు ప్రకటించిన వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే
ఏపీలోని చెరుకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా సీతా నగరంలోని ఎన్ సీఎస్ షుగర్ ఫ్యాకర్టీ వద్ద చెరుకు రైతులు చేపట్టిన మహాధర్నాకు ఆయన మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఎన్ సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. చెరుకు రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వం హామీ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications