ప్రత్యేక హోదాపై సుజన మెలిక, 'పవన్ కళ్యాణ్‌పై జేసి ఏమన్నారో తెలియదు'

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషమయై కేంద్రమంత్రు సుజనా చౌదరి గురువారం నాడు ట్విస్ట్ ఇచ్చారు. లోకసభ జరిగితేనే కదా, మనం ప్రత్యేక హోదా, నిధుల గురించి కేంద్రాన్ని అడగడానికి వీలుంటుందని చెప్పారు.

పార్లమెంటును స్తంభింప చేయడం మంచిది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన కేంద్రంతో తాము పలుమార్లు సంప్రదింపులు జరిపామని చెప్పారు. సభను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పదేపదే అడ్డుకుంటున్నారన్నారు.

ఆలస్యం అయితే అయింది, కానీ ప్రత్యేక హోదా, నిధులు సాధిస్తామని చెప్పారు. కేంద్రంలో మేము, ఏపీలో బిజెపి ప్రభుత్వంలో ఉందని, తామిద్దరం కలిసి పోతున్నామన్నారు.

Sujana Chowdary twist on special status to AP

హోదా పైన కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. కాంగ్రెస్ వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని చెప్పారు. సెక్షన్ 8 కోసం ప్రత్యేకంగా పోరాడవలసిన అవసరం లేదన్నారు. పునర్విభజన చట్టంలో భాగమే సెక్షన్ 8 అన్నారు.

ఏపీ సమస్యలు ప్రస్తావించలేకపోతున్నాం

అంతకుముందు ఎంపీలు పార్లమెంటు ఆవరణలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటును స్తంభింప చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. పార్లమెంటును స్తంభింప చేయడం వల్ల ఏపీ సమస్యలు ప్రస్తావించలేకపోతున్నామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందన్నారు. సభలో కాంగ్రెస్ వైఖరితో తీరని నష్టం కలుగుతోందన్నారు. సభ సజావుగా సాగితే, ఏపీకి ప్రత్యేక హోదా, నిధులపై చర్చించవచ్చన్నారు. ప్రత్యేక హోదాపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన కూడా ఎంపీలు స్పందించారు. ఆయన ఏం చెప్పాడో తాము వినలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, సెక్షన్ 8ను అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు.

పట్టిసీమ ప్రాజెక్టు పనులు వేగవంతం: బాబు

పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మాణంలో పట్టిసీమ ప్రాజెక్టును గురువారం ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలిచారు. విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులకు అవసరమైన 75 పొక్లెయిన్‌లు, టిప్పర్లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

గడువులోపు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆగస్టు 2న మరోసారి పట్టిసీమ ప్రాజెక్టును పరిశీలిస్తానన్నారు. 2018 లోపు పోలవరం డ్యాం పూర్తి చేస్తామని, ఆగస్టు 15లోపు తోటపల్లి రిజర్వాయర్‌ను, గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+