'అమరావతిలో సెక్షన్ 8 మెయిన్ ఆఫీస్, కేంబ్రిడ్జ్ ఇదే మెయిన్'

న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సెక్షన్ 8 కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి సోమవారం నాడు చెప్పారు. దేశంలో కేంబ్రిడ్జికి ఇదే ప్రధాన కార్యాలయం కానుందన్నారు.

సెంటర్ ఫర్ ఎక్సలెన్సీని అభివృద్ధి చేస్తామని సుజనా చౌదరి చెప్పారు. అక్టోబర్ 15వ తేదీ లోగా అవగాహన ఒప్పందం చేసుకుంటామని తెలిపారు.

Sujana says Secion 8 main office in Amaravati

రైతులు బాగుంటేనే మనం బాగుంటాం: చంద్రబాబు

రైతుల నుంచి ఫిర్యాదులు బాగా తగ్గాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. విత్తనాలు, ఎరువుల కొరతపై ఫిర్యాదులు రావడం లేదని, బ్యాంకులు రుణాలు సక్రమంగా ఇవ్వట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

రైతుల బాధలను బ్యాంకర్లు అర్థం చేసుకోవాలన్నారు. రైతులు బాగుంటే మనం బాగుంటామన్నారు. పేదవాడికి ప్రతి నెల రూ.10వేలు లబ్ధి కలిగేలా ఆలోచనలు చేస్తున్నామని, అన్ని బ్యాంకులు రోబోటిక్స్‌ వైపు దృష్టి సారించడం శుభపరిణామమన్నారు.

రాజధాని నిర్మాణంపై సీబీఐ విచారణ జరపాలి: భూమన

స్విస్ ఛాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని, అమరావతి నిర్మాణం పైన సీబీఐ విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం నాడు డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణాన్ని విదేశాలకు అప్పగించడం సరికాదన్నారు. పేదవాళ్లను వెలివేసే రాజధాని మనకు వద్దని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+