'రాజధాని కోసం టీడీపీలో సుజనాXసీఎం వర్గాలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై తెలుగుదేశం పార్టీలో ఎంపీలు సుజనా చౌదరి వర్గం, సీఎం రమేష్ వర్గాలు పట్టుపడుతున్నాయని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పార్థసారధి హైదరాబాదులో ఆరోపించారు. సుజనా గ్రూపుకు అమలాపురం రాజధాని కావాలని, సీఎం రమేష్ వర్గం నూజివీడు వైపు రాజధాని చేయాలని పట్టుపడుతున్నాయన్నారు.
విజయవాడ పరిసరాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలు కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయన్నారు. టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభనష్టాల బేరీజు వేసుకున్న తరువాతే కానీ కొత్త రాజధానిపై స్పష్టత రాదని విమర్శించారు.

చంద్రబాబు మంత్రివర్గంలో బీసీ మంత్రులకు అవమానం జరుగుతోందన్నారు. కొత్త రాజధానిలో బడుగు బలహీన వర్గాలు బతికేలా ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించాలన్నారు.
పోలవరం టెండర్ల కేటాయింపుల్లో పెదబాబు, చినబాబులకు దక్కిన వాటాలెంతో చెప్పాలన్నారు. పోలవరం అవకతవకలపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతులకు అదే విస్తీర్ణంలో భూములు కేటాయించాలని సూచించారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications