జగన్ సీమ ద్రోహి: పీతల, సిగ్గుపడాలన్న ఈశ్వరి

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాసనభను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు 15 నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సిఎం చంద్రబాబునాయుడు రాయలసీమకు నీరివ్వాలని ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షం అడ్డుకుంటోందని అన్నారు.

ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. దళిత మంత్రి అయిన సుజాతను అవమానపర్చేలా వ్యాఖ్యల చేయడం సరికాదన్నారు.

సిగ్గుపడేలా చేస్తున్నారు: ఈశ్వరి, సిఎంపై చెవిరెడ్డి ఫైర్

Sujatha fires at YS Jagan

అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యుడు బొండా ఉమా ప్రవర్తించిన తీరు సమాజం సిగ్గుపడేలా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి అన్నారు. బొండా ఉమా సభలో ఓ గుండాలా వ్యవహరించారని మండిపడ్డారు.

మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సిఎం చంద్రబాబు తోపాటు అధికార పక్షం సభ్యులు సభా గౌరవాన్ని మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇలా మాట్లాడాలని సభ్యులకు చెబుతున్నారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. వైయస్ జగన్ చదువుకునే సమయంలో జవాబు పత్రాలను దొంగిలించాడని నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

అంతుచూస్తామని, పిచ్చివేషాలు వేస్తున్నారని, ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చంద్రబాబునాయుడుపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని అన్నారు. చంద్రబాబు చేసిన ఏడు అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అధికార పక్షం సభ్యుల వ్యవహారతీరును చూస్తుంటే మనం దేశంలోనే ఉన్నామా? అనే సందేహం కలుగుతోందని అన్నారు. ఇకనైనా అధికార పక్షం సభ్యులను హుందాగా వ్యవహరించేలా చూడాలని కోరుతున్నట్లు చెవిరెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+