ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు: సాయిశ్రీ తల్లి తీవ్రవ్యాఖ్యలు
ఓ ప్రజాప్రతినిధి అనుచరుల నుండి ఫోన్లలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, వారి నుండి తనకు ప్రాణహాని ఉందని లుకేమియాతో ఇటీవల మరణించిన చిన్నారి సాయిశ్రీ తల్లి సుమశ్రీ ఆరోపించారు.
విజయవాడ: ఓ ప్రజాప్రతినిధి అనుచరుల నుండి ఫోన్లలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, వారి నుండి తనకు ప్రాణహాని ఉందని లుకేమియాతో ఇటీవల మరణించిన చిన్నారి సాయిశ్రీ తల్లి సుమశ్రీ ఆరోపించారు.
తనకు ట్రీట్ మెంట్ చేయించాలని కోరుతూ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు సెల్పీ వీడియోను రికార్డింగ్ చేసిన సాయిశ్రీ అనే బాలిక ఉదంతం సంచలనం కల్గించిన విషయం తెలిసిందే.
అయితే సాయిశ్రీ చనిపోయిన తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.సాయిశ్రీ మరణం రాజకీయంరంగుపులుముకొంది. విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు తనను బెదిరిస్తున్నారని, తన ఫ్లాట్ ను అమ్ముకోకుండా అడ్డుకొంటున్నారని సుమశ్రీ ఆరోపించింది.
ఈ కేసులో అనేక ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. సుమశ్రీ తన భార్యే కాదు. సాయిశ్రీ తన కూతురే కాదని శివకుమార్ ఆరోపించారు. మరో వైపు కృష్ణకుమార్ అనే వ్యక్తి సాయిశ్రీ ట్రీట్ మెంట్ కోసం డబ్బులు ఖర్చులు చేశాడని సుమశ్రీ ప్రకటించింది.
ఇదిలా ఉంటే కృష్ణకుమార్ మొదటి భార్యగా చెప్పుకొన్న ఓ మహిళ సుమశ్రీపై, కృష్ణకుమార్ పై విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.తాజాగా శివకుమార్ పై సుమశ్రీ మరోసారి ఆరోపణలు చేసింది.బుదవారంనాడు ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడింది.

ప్రాణహాని ఉందన్న సుమశ్రీ
తనకు ఓ ప్రజాప్రతినిధి అనుచరుల నుండి ప్రాణహాని ఉందని లుకేమియా వ్యాధితో మరణించిన చిన్నారి సాయిశ్రీ తల్లి సుమశ్రీ ఆరోపించింది.గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి చిరునామాలు అడుగుతున్నారని ఆమె ఆరోపించారు. శివకుమార్ తనకు రూ.15 లక్షలు కాదు కదా...కనీసం రూ.1500 విలువైన బంగారం కూడ ఇవ్వలేదన్నారామె.

డబ్బులుంటే తన కూతురును బతికించుకొనేదాన్ని
శివకుమార్ తన కూతురు ట్రీట్ మెంట్ కోసం డబ్బులు, బంగారం ఇచ్చినట్టు చెబుతున్న మాటలు వాస్తవం కాదన్నారు సుమశ్రీ. డబ్బులు, బంగారం ఉంటే తన కూతురు సాయిశ్రీని బతికించుకొనేదాన్ని అని ఆమె చెప్పారు. శివకుమార్ తనకు బంగారం ఇచ్చినట్టు సాక్ష్యం ఉందా అని ఆమె ప్రశ్నించారు. పాప చనిపోయిందనే సమాచారం చెప్పేందుకు ప్రయత్నించినా శివకుమార్ ఫోన్ ఎత్తలేదని చెప్పారు.

ఫ్లాట్ ను విక్రయించకుండా అడ్డుకొన్నారు
దుర్గాపురంలోని ఉన్న ఫ్లాట్ ను విక్రయించకుండా అడ్డుకొన్నారని ఆమె ఆరోపించారు.ఈ ఫ్లాట్ విక్రయిస్తే వచ్చే డబ్బుతో తన కూతురుకు వైద్యం చేయించాలని బావించానని చెప్పారు. అయితే ఈ ఫ్లాట్ ను విక్రయించకుండా అడ్డుకొన్నారని ఆమె ఆరోపించారు. ఓ ప్రజాప్రతినిధి అనుచరులతో తనపై దౌర్జన్యం చేయించారని చెప్పారు.

పోలీసు కమిషనర్ కు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు
సాయిశ్రీ మరణించిన తర్వాత ఈ విషయమై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదుచేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. కూతురును కోల్పోయిన తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.తాను మూడునెలలుగా ఓ ప్రజాప్రతినిధిపై ఆరోపణలు చేస్తున్నా ఆయన అనుచరులు గాని, ఆయన గాని బహిరంగంగా ఎందుకు ఖండించడం లేదని ఆమె ప్రశ్నించారు. తనతోపాటు ఉంటున్న కృష్ణకుమార్ పై ఆరోపణలు చేస్తున్న నీలిమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు కృష్ణకుమార్ కు నీలి భార్యే కాదని స్పష్టం చేశారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications