ఏపీ ప్రజలకు శుభవార్త.. ఒక్కో ఫ్యామిలీకి ఏడాదికి 25 లక్షలు
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నేడు క్యాబినెట్ భేటీ జరిగింది ఈ భేటీలో ఏపీ ప్రజలకు సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ కి చంద్రబాబు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భీమా కల్పించనుంది. ఒక్కో కుటుంబానికి ప్రతి సంవత్సరం 25 లక్షల రూపాయల ఉచిత వైద్య చికిత్సలను అందించే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినేట్ ఆమోదం
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో 1.63కోట్ల కుటుంబాలకు ఈ ఆరోగ్యబీమా వర్తించనుంది. పేద, మధ్యతరగతి, ధనిక అన్న తేడాలు లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఈ హెల్త్ పాలసీని అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.

2493 నెట్వర్క్ ఆసుపత్రులలో 3257 రకాల ట్రీట్మెంట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 2493 నెట్వర్క్ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని చంద్రబాబు సర్కార్ అమలు చేయనుంది. మొత్తం 3257 రకాల ట్రీట్మెంట్ లను ఈ హైబ్రిడ్ పద్ధతిలో ఉచితంగా ప్రజలకు అందిస్తారు. అంతేకాదు ట్రీట్మెంట్ కోసం వచ్చేవారికి త్వరితగతిన అప్రూవల్ ఇవ్వడానికి కూడా తగిన చర్యలు చేపడతారు. అప్లై చేసుకున్న ఆరు గంటల్లోనే ట్రీట్మెంట్ కు అనుమతులు ఇచ్చేలా ఫ్రీ ఆథరైజేషన్ చర్యలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని కుటుంబాలకు లబ్ది
రెండున్నర లక్షల లోపు ఉన్న వైద్య చికిత్సలకు క్లెయిమ్ లు వచ్చేలా సరికొత్త విధానాన్ని రూపొందించారు. రెండున్నర నుండి 25 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చెల్లించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.43 కోట్ల పేద కుటుంబాలతో పాటు, 20 లక్షల మంది మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీతో లబ్ధి చేకూరనుంది.
కొత్తగా 10 మెడికల్ కళాశాలలు
ఇదిలా ఉంటే నేడు క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పిపిపి విధానంతో కొత్తగా పది మెడికల్ కళాశాలలు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ పది కాలేజీలను ఒకే దశలో కాకుండా రెండు దశలలో నిర్మించనున్నారు. పాలకొల్లు, బాపట్ల, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురం, పెనుగొండ, మదనపల్లె, ఆదోని, పులివెందుల, మార్కాపురంలలో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications