భోళా శంకర్‌కు మహేష్ బెస్ట్ విషెస్- టికెట్ల వివాదం వేళ..!!
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం- భోళా శంకర్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ఇది. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా హీరోయిన్. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషించింది. మచ్ హైప్డ్ మూవీ- ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే భోళా శంకర్ సందడి మొదలైంది కూడా.
ఏపీలో ఈ సినిమా రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఇష్టానుసారంగా టికెట్ల రేట్లను పెంచడానికి అంగీకరించట్లేదు. సామాన్య ప్రేక్షకులపై ఏ మాత్రం భారం పడకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

ఆయా డాక్యుమెంట్లన్నింటినీ సక్రమంగా అందజేసిన ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాల టికెట్ల రేట్లను పెంచుకోవడానికి తాము అనుమతి ఇచ్చిన విషయాన్ని ఎఫ్డీసీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆ రెండు సినిమాల నిర్మాతలు సక్రమంగా, సకాలంలో తాము కోరిన పత్రాలను అందజేశారని తెలిపింది.
Looking forward to #BholaShankar! Sending my best wishes to @KChiruTweets sir, my dear friend @MeherRamesh, and my favourite producer @AnilSunkara1 for a blockbuster release tomorrow!
— Mahesh Babu (@urstrulyMahesh) August 10, 2023
ఈ పరిణామాల మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు.. భోళా శంకర్ చిత్రం యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకొన్ని గంటల్లో విడుదల కాబోతోన్న నేపథ్యంలో- ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మహీ ఆకాంక్షించారు. ఈ మేరకు తన ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారాయన. దీన్ని హీరో చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకరకు ట్యాగ్ చేశారు.
నిజానికి- మెహర్ రమేష్.. మహేష్ బాబుకు మంచి స్నేహితుడు. ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉంటాడని అభిమానులు చెబుతుంటారు. గతంలో బాబీ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా కనిపించారు మెహర్. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. చాలా రోజుల విరామం తరువాత మళ్లీ మెహర్ రమేష్ మైక్ పట్టుకున్నారు. దీనితో అతనికి, యూనిట్‌కు విషెస్ తెలిపారు మహేష్..












Click it and Unblock the Notifications