ప‌సుసు-కుంకుమ‌..అన్న‌దాత సుభీభ‌వ‌: ఎన్నిక‌ల వేళ న‌గ‌దు బ‌దిలీ నిర్ణ‌యాలా: సుప్రీం నోటీసులు..!

ఎన్నిక‌ల ముందు ప్ర‌భుత్వాలు న‌గ‌దు బ‌దిలీ చేయ‌టం పైన సుప్రీం స్పందించింది. ఈ వ్య‌వ‌హారం పైన దాఖ‌లైన పిటీష‌న్‌ను స్వీక‌రించిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో..తెలంగాణ‌లో ప‌ధ‌కాల పేరుతో నేరుగా ల‌బ్దిదారుల ఖాతాల్లోకి న‌గ‌దు బ‌దిలీ చేసారు. ఏపీలో ప‌సుపు-కుంకుమ‌, అన్న‌దాత సుఖీభ‌వ వంటి ప‌ధ‌కాల పేరుతో న‌గ‌దు జ‌మ చేసారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం పైన సుప్రీం కేంద్ర ప్ర‌భుత్వంతో పాటుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి..ఏపీ-తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు నోటీసులు జారీ చేసింది.

 ఎన్నిక‌ల వేళ న‌గ‌దు బ‌దిలీలా...

ఎన్నిక‌ల వేళ న‌గ‌దు బ‌దిలీలా...

తాజా ఎన్నిక‌ల ముందు న‌గ‌దు బ‌దిలీ వ్య‌వ‌హారం పై సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఏపీలో నాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్ర‌భుత్వం ప‌సుపు కుంకుమ‌-రైతు బంధం పేరుతో ల‌బ్ది దారుల ఖాతాల్లో నేరుగా న‌గ‌దు జ‌మ చేసారు. దీని ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందాల‌ని ప్ర‌యత్నించారు. ఏపీలో ప‌సుపు కుంకుమ ప‌ధ‌కం కింద మొత్తం 94 ల‌క్ష‌ల మంది డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఒక్కొక్క‌రికి ప‌ది వేలు చొప్పున గ‌తంలో ఒక‌సారి జ‌మ చేసారు. తిరిగి తాజా ఎన్నిక‌ల్లో పోలింగ్ మ‌రో రెండు రోజుల్లో ఉంద‌న‌గా రెండో విడ‌త ఇదే ర‌కంగా 94 ల‌క్ష‌ల మందికి ప‌ది వేలు చొప్పున న‌గ‌దును నేరుగా వారి ఖాతాల్లోకి జ‌మ చేసారు. అదే విధంగా ఎన్నిక‌ల ముందే తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఏపీలో రైతుల‌కు రైతుబంధు ప‌ధ‌కం కింద ఒక్కో రైతు ఖాతాలో మూడు వేల రూపాయాల చొప్పున జ‌మ చేసారు. అయితే, దీని పైన కొంద‌రు ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించినా. అది కోడ్ రాక‌ముందే అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మం కావ‌టంతో తాము అడ్డుకోలేమ‌ని స్ప‌ష్టం చేసింది.

సుప్రీంకోర్టులో పిటీష‌న్..

సుప్రీంకోర్టులో పిటీష‌న్..

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌భుత్వ సొమ్మును అధికారంలో ఉన్న పార్టీ న‌గ‌దు బదిలీ చేయ‌టం పైన పిటీష‌న‌ర్ సుప్రీం ను ఆశ్ర‌యించారు. ఎన్నికల సమయంలో అమలు చేసిన ఈ పథకాలను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని విన్నవించారు. అదే విధంగా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు నుంచీ నగదు బదిలీ పథకాలు అమలు చేయకుండా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు.ఇదే స‌మ‌యంలో తాజా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇత‌ర ప్రాంతాల్లో ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించిన ఉదంతాల మీద వివ‌ర‌ణ కోరారు. తాజాగా ఈ పిటీష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీం దీని పైన వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు ఏపీ-తెలంగాణ ప్ర‌భుత్వాల‌తో పాటుగా కేంద్ర ప్ర‌భుత్వం..ఎన్నిక‌ల సంఘానికి నోటీసులు జారీ చేసింది. గ‌తంలో ఇదే వ్య‌వ‌హారం మీద హైకోర్టులోనూ ఒక పిటీష‌న్ దాఖ‌లైంది. ఇప్పుడు నేరుగా సుప్రీం నోటీసులు జారీ చేయ‌టంతో తిరిగి చ‌ర్చ మొద‌లైంది.

Recommended Video

    టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు భరోసా
    ఎన్నిక‌ల్లో ల‌బ్ది కోస‌మే...

    ఎన్నిక‌ల్లో ల‌బ్ది కోస‌మే...

    ఎన్నిక‌ల వేళ అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి అధికారం దక్కించుకోవ‌టం కోస‌మే ప్ర‌జా సొమ్మును న‌గ‌దు రూపంలో అంద‌చేయ‌టం పైన అప్పుడే అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. ఏపీలో ప్ర‌ధానంగా కోటి మంది వ‌ర‌కు ఉన్న డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌సుపు కుంకుమ ప‌ధ‌కం ద్వారా ప‌ది వేలు చొప్పున ఇవ్వ‌టంతో వారు ఖ‌చ్చితంగా త‌మ వైపే నిలుస్తార‌ని .. నిలిచార‌ని ఎన్నిక‌ల త‌రువాత సైతం అధికార పార్టీ నేత‌లు చెప్పుకొచ్చారు. అయితే ఫ‌లితాలు మాత్రం తారుమారు అయ్యాయి. అదే విధంగా తెలంగాణ‌లో సైతం రైతుబంధు స్కీం సైతం గ‌తంలో తెలంగాణ‌లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల ముందుగానే న‌గ‌దు బ‌దిలీ చేసార‌నే వాద‌న ఉంది. ఇప్పుడు సుప్రీం నోటీసుల‌కు వీరు ఎలా స్పందిస్తార‌నేది ఆసక్తి క‌రంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+