వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. వివేకా కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి సవాల్ చేస్తూ వీటిని దాఖలు చేశారు. దస్తగిరి అఫ్రూవర్ గా మారడాన్ని సహ నిందితులు ఎలా సవాల్ చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

దస్తగిరి, రంగయ్య ఇచ్చిన సమాచారంతోనే...
వివేకా
వద్ద
డ్రైవర్
గా
పనిచేసి
మానేసిన
దస్తగిరి
సీబీఐకి
అఫ్రూవర్
గా
మారిన
సంగతి
తెలిసిందే.
దస్తగిరి
ఇచ్చిన
వాంగ్మూలాన్ని
ఆసరాగా
చేసుకొనే
సీబీఐ
అధికారులు
కొందరిని
అరెస్ట్
చేయడం
జరిగింది.
సీబీఐ
అధికారులు
కీలక
సమాచారాన్ని
సేకరించడంలో
దస్తగిరితోపాటు
వివేకానందరెడ్డి
ఇంటి
వద్ద
వాచ్
మెన్
గా
పనిచేసిన
రంగయ్య
కూడా
సహాయపడ్డాడు.
ప్రస్తుతం
సీబీఐ
వీరిచ్చిన
సమాచారం
ఆధారంగానే
విచారణను
వేగవంతం
చేశారు.

సీబీఐకి కీలకంగా మారిన ఫొటోగ్రాఫర్!
దాదాపు
ఆరు
నెలలకు
పైగా
విరామం
తర్వాత
ఇటీవలే
సీబీఐ
తన
దర్యాప్తును
పున:ప్రారంభించింది.
అధికారులు
మొట్టమొదటిసారిగా
వివేకా
హత్య
జరిగినచోట
ఫొటోలు
తీసిన
వ్యక్తినే
ప్రశ్నించారు.
విరామం
తర్వాత
విచారణ
ప్రారంభించినప్పుడు
కూడా
ఇతన్నే
ప్రశ్నించారు.
నిందితులు
సీబీఐ
అధికారులను
బెదిరింపులకు
గురిచేయడం,
హెచ్చరించడంతోపాటు
దర్యాప్తు
సాగకుండా
ఉండేందుకు
పలు
ప్రయత్నాలు
చేశారు.
దీంతో
వివేకా
కేసును
ప్రతిష్టాత్మకంగా
తీసుకొని
ఛార్జిషీటును
దాఖలు
చేశారు.
అందులో
పేర్కొన్న
విషయాలు
కూడా
బయటకు
వెల్లడయ్యాయి.

నెలాఖరులో స్పష్టత?
మరోవైపు
వివేకా
కుమార్తె
సునీత
సుప్రీంకోర్టులో
పిటిషన్
దాఖలు
చేశారు.
ఏపీలో
తన
తండ్రి
హత్యకేసు
దర్యాప్తు
సరిగా
సాగడంలేదని,
నిందితులంతా
రాజకీయంగా
పలుకుబడి
కలిగిన
వ్యక్తులని,
కేసు
విచారణను
ఇతర
రాష్ట్రంలో
చేపట్టాలంటూ
కోరారు.
దీనిపై
కోర్టు
ధర్మాసనం
నిందితుల
తరఫు
న్యాయవాదిని
అడిగారు.
వాయిదా
పడిన
ఈకేసు
విచారణ
ఈ
నెలాఖరులో
చేపట్టబోతున్నారు.