వంశీ బెయిల్ రద్దు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు...!!
వల్లభనేని వంశీ కు బెయిల్ దక్కింది. ఈ రోజు జైలు నుంచి విడుదల అవుతారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. వంశీ పైన ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ దక్కటం తో ఇక విడుదలకు మార్గం సుగమం అయింది. అయితే, వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన విచారణ చేసిన ఉన్నత న్యాయ స్థానం కీలక నిర్ణయం వెలువరించింది.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి నూజివీడు కోర్టు షరతు లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయలకు 2 ష్యూరిటీలు, వారానికి రెండుసార్లు స్టేషన్ కి రావాలంటూ కోర్టు షరతులు పెట్టింది. వల్లభనేని వంశీ ఈ కేసులో ఇప్పటివరకూ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా బెయిల్‌తో ఇంతవరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లో నూ ఆయనకి బెయిల్ మంజూరు వచ్చింది. కాగా, వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. దీంతో, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ విడుదల అవుతారా, లేదా అనే ఉత్కంఠ నడుమ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. గన్నవరంలో సీతామహాలక్ష్మి స్థలం వివాదంలో నమోదైన కేసులో వంశీకి బెయిల్ దక్కింది. కాగా, బెయిల్ రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. అక్రమ మైనింగ్ కేసులోనూ బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
మైనింగ్ వాల్యుయేషన్ పూర్తి నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో, రెండు కేసుల్లోనూ సుప్రీం కోర్టు బెయిల్ రద్దుకు తిరస్కరించింది. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో, ఇప్పటి వరకు వంశీ పైన ఉన్న పది కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. ఇక, సుప్రీం తాజా నిర్ణయంతో ఈ రోజు జైలు నుంచి విడుదల కావటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications