2వ విడత ఇంజనీరింగ్ కౌన్సెల్‌కు గ్రీన్ సిగ్నల్, షరతులు
న్యూఢిల్లీ: రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పైన సుప్రీం కోర్టు నుండి కీలక నిర్ణయం వెలువడింది. రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహణకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌన్సెలింగ్ ప్రక్రియ నంబర్ 14లోపు ముగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
రెండో విడత కౌన్సెలింగ్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి తెలిపింది. గుర్తింపు రద్దయిన 174 కళాశాలలు, విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా విచారణ చేపట్టిన కోర్టు, ఏఐసీటీఈ తనిఖీలకు లోబడే ప్రవేశాలు ఉంటాయని చెప్పింది.
తనిఖీల్లో కళాశాలల గుర్తింపు రద్దయితే విద్యార్థులు కోర్టుకు రావద్దని సుప్రీం స్పష్టం చేసింది. అటు కళాశాలలు విద్యార్థుల ఫీజును ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని పేర్కొంది. ఈ క్రమంలో కౌన్సెలింగ్ కు షెడ్యూల్ రూపొందించాలని, నవంబర్ 14లోపు కౌన్సెలింగ్ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశాలిచ్చింది.

అలాగే, 240 రోజుల్లో విద్యా ప్రణాళికను పూర్తి చేస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. జేఎన్టీయు అనుబంధ కళాశాలల్లో వసతుల తనిఖీకి ఆర్డర్ వేస్తామని పేర్కొంది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసిన కోర్టు, కౌన్సెలింగుకు సంబంధించిన తుది ఉత్తర్వులు మంగళవారం ఇవ్వనుంది.
సుప్రీం కోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు ఇరవై వేల నుండ ముప్పై వేల మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభమై సుమారు రెండు నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ జేఎన్టీయు అనుబంధ గుర్తింపు కోల్పోయిన 174 కళాశాలలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘ వాదనల అనంతరం తాజా నిర్ణయం వెలువడింది. అయితే, తుది తీర్పు మాత్రం రేపు రానుంది. తీర్పు నేపథ్యంలో తెలంగాణలోని 174 కళాశాలలకు కౌన్సెలింగ్ నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ప ైన ఏపీ ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు ప్రారంభించే అవకాశముంది.












Click it and Unblock the Notifications