ఏపీ రాజధాని బిల్లుల స్టేటస్‌కోపై సుప్రీంలో కీలక విచారణ- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ...
ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులు సంచలనం రేపుతున్నాయి. వీటిని సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక విచారణ జరపనుంది. ఇందులో వచ్చే తీర్పుపై ప్రభుత్వంతో పాటు అమరావతి రైతులు, విపక్షాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.
ఏపీలో గవర్నర్ ఆమోదం పొందిన రాజధాని బిల్లులపై ఈ నెల 27 వరకూ స్టేటస్‌కో విధిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. వీటిని సుప్రీం కోర్టు ధర్మాసనం ఇవాళ విచారించనుంది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరుతోంది. అయితే ఇందులో పలు కీలక విషయాలు ఇమిడి ఉన్నందున స్టే ఇవ్వొద్దని ప్రతివాదులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక హైకోర్టు ఆదేశాలు పక్కనబెడితే ఏపీ ప్రభుత్వానికి రాజధాని తరలింపుకు మార్గం సుగమం అవుతుంది. అలా కాక హైకోర్టులోనే తేల్చుకోమని చెబితే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కానుంది. చివరికి ఈ నెల 27న హైకోర్టు విచారణ కోసం ఎదురు చూడాల్సిన పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురవుతుంది. దీంతో ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు విచారణ, ఉత్తర్వుల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
ఇప్పుడు సుప్రీంకోర్టు గనక.. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్‌ను పక్కన పెడితే... అది ఏపీ ప్రభుత్వానికి ఊరట ఇచ్చే అంశం కానుంది.
★ కాగా.. రాజధాని పిటిషన్లపై గత వారం విచారణ జరిపిన హైకోర్టు.. మద్యంతర ఉత్తర్వులను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది..
★ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గతంలోనే స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే.
★ అయితే, సుప్రీంకోర్టులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications