ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు భారీ షాక్; ఆ కేసులో సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిబిఐ విచారణ కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైకోర్టు తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. సిఆర్పిసి ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని, ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలనే హక్కు నిందితుడికి లేదని ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపకుండా సిబిఐ కేసు నమోదు చేయడంపై ఆదిమూలపు సురేష్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సురేష్ దంపతులు వాదనను సమర్థించింది హైకోర్టు. సిబిఐ అభియోగాలను హైకోర్టు తోసిపుచ్చింది. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లో లోపాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. మరోసారి ప్రాథమిక విచారణ జరపాలని ఆదేశించింది.

హైకోర్టు తీర్పుపై సి.బి.ఐ అధికారులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి సీబీఐ విచారణ కొనసాగించాలని తీర్పునిచ్చింది. గతంలో తెలంగాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ దంపతులకు చుక్కెదురైంది. ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ తో పాటుగా ఆయన భార్య విజయలక్ష్మి పై 2016 లో కేసు నమోదైంది. ప్రస్తుతం విజయలక్ష్మి ఇంకా సర్వీస్ లో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో 2017లో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ కేసులో విచారణను నిలిపివేయాలని ఆదిమూలపు సురేష్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈ కేసులో సి.బి.ఐ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సిబిఐ. చివరకు ఈ కేసులో సి.బి.ఐ పైచెయ్యి సాధించింది. ఈ కేసులో గత నెల 22వ తేదీన విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు శుక్రవారం రోజు తన తీర్పును వెల్లడించింది. సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులు సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది.
Recommended Video
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications