చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు రెడీ- దీన్ని బట్టి రేపు, ఎల్లుండి..?
గతేడాది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వబోతోంది. ఈ మేరకు ఇప్పటికే తీర్పు తేదీ, సమయం ఖరారు చేసింది. దీని ప్రకారం ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇవ్వబోతోంది. ఈ తీర్పు కేవలం చంద్రబాబుకో, ఆయనపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసుకో కాకుండా చాలా మంది రాజకీయ నాయకులకు, కేసులకూ వర్తించబోతోంది.
చంద్రబాబుపై ఏపీ సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసి అరెస్టు చేయడంతో దీనికి రాజ్యాంగంలో చేసిన మార్పు ప్రకారం సెక్షన్ 17ఏ అనుసరించి గవర్నర్ అనుమతి అవసరం ఉందని ఆయన న్యాయవాదులు వాదించారు. కానీ ఈ వాదనను విజయవాడ ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు కూడా తిరస్కరించింది. దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో మరికొన్ని కేసుల్లోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపైనా నిర్ణయం సుప్రీంకోర్టుకు చేరడంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది.

సెక్షన్ 17ఏ అమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ నేతలపై కొత్తగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం, వాటి ఆధారంగా అరెస్టులు చేయడం సక్రమమా కాదా అన్న దానిపై సుప్రీంకోర్టులో సుదీర్ధ విచారణ జరిపింది. ఇందులో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులతో పాటు పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అంతిమంగా విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు.. తీర్పును కొన్ని నెలలుగా రిజర్వులోనే ఉంచింది. అదే సమయంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్లు కూడా విచారణకు వచ్చాయి.
ఏపీ స్కిల్ కేసుతో పాటు ఫైబర్ నెట్, ఇతర కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిలో తీర్పు ఇవ్వాలంటే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఈ ఒక్క తీర్పు కోసం ఆ కేసుల్లోనూ విచారణ ముందుకు సాగని పరిస్దితి. దీంతో క్వాష్ పిటిషన్ పై ఇవాళ తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ తీర్పు ప్రకటన తర్వాత రేపు, ఎల్లుండి స్కిల్, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ల వ్యవహారం కూడా తేలిపోనుంది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications