చంద్రబాబు కీలక మంత్రాంగం - అక్కడే ఆశలు, కొత్త వ్యూహం..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక మంత్రాంగం నిర్వహిస్తున్నారు. స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పైన విడుదలైన చంద్రబాబు అటు రాజకీయం..ఇటు న్యాయ పోరాటం పైన వరుస సమావేశాలు కొనసాగిస్తున్నారు. వైసీపీతో పోరాటం పైన పవన్ తో చర్చించిన చంద్రబాబు..ఇప్పుడు సుప్రీంలో స్కిల్ కేసులో క్వాష్ పిటీషన్ తీర్పు వేళ న్యాయవాది సిద్దార్థ్ లుద్రా బృందంతో సమావేశమయ్యారు. తీర్పు అనుకూలంగా వస్తే పరిస్థితులు అనుకూలంగా మారుతాయని..ఒక వేళ భిన్నంగా ఉంటే ఏం చేయాలనే దాని పైన కీలక చర్చలు చేస్తున్నట్లు సమాచారం.

లూధ్రా టీంతో చర్చలు
సీఐడీ నమోదు చేసిన స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. హైకోర్టు అనారోగ్య కారణాలపైన మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో బయటకు వచ్చారు. చంద్రబాబు పైన సీఐడీ వరుస కేసులు నమోదు చేస్తోంది. అయితే, స్కిల్ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు తొలి నుంచి బెయిల్ కంటే క్వాష్ పైనే ఫోకస్ చేసారు.

Supreme Lawyer Sidharth Luthra meets Chandra Babu amid Judgement on Quash petition

హైకోర్టులో క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేయటంతో సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు. చంద్రబాబు తరపు హరీష్ సాల్వే, సిద్దార్థ్ లుద్రా సుదీర్ఘ వాదనలు వినిపించింది. సీఐడీ తరపు ముఖుల్ రోహిత్గీ వాదనలు కొనసాగించారు. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని..గవర్నర్ అనుమతి లేకుండా జరిగిన ఈ అరెస్ట్..కేసును క్వాష్ చేయాలని చంద్రబాబు కోర్టును అభ్యర్దించారు.

సుప్రీం తీర్పు వేళ
ఈ కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ నెల 8న తీర్పు వెల్లడికి రిజర్వ్ చేసింది. ఇదే సమయంలో 9న ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. చంద్రబాబు కేసుల్లో ఇప్పుడు 17ఏ కీలకంగా మారింది. ఈ అంశం చుట్టూనే సుప్రీంలో వాదనలు జరిగాయి. సుప్రీం నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందని చంద్రబాబు అండ్ టీం ఆశిస్తున్నారు.

అనుకూలంగా వస్తే ఈ కేసుల వ్యవహారంలో రిలీఫ్ దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కోర్టు తీర్పు భిన్నంగా ఉంటే ఏం చేయాలి..ఇతర కేసుల్లో సీఐడీ ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ న్యాయ పరంగా ఎలాంటి చర్యలతో ముందుకు వెళ్లాలనే దాని పైన న్యాయవాదుల టీంతో చంద్రబాబు చర్చలు చేస్తున్నట్లు సమాచారం.

సీఐడీ కేసులపై చర్చ
చంద్రబాబు పైన తాజాగా నమోదు చేసిన కేసుల్లో అరెస్ట్ వ్యవహారం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. అనారోగ్య కారణాలతో మధ్యంత బెయిల్ పైన చంద్రబాబును అరెస్ట్ చేయమని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేసారు. రెగ్యులర్ బెయిల్ పైన ఈ నెల 10న హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే, సుప్రీంలో క్వాష్ పిటీషన్ పైన తీర్పు ఆధారంగా న్యాయ పరంగా తదుపరి విచారణ..నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు సుప్రీంలో వచ్చే తీర్పు పైనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+