29వ రాష్ట్రంగా తెలంగాణ: మ్యాప్, సరిహద్దులు విడుదల చేసిన సర్వే ఆఫ్ ఇండియా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సరిహద్దులను సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా శుక్రవారం నాడు విడుదల చేసింది. తెలంగాణకు ప్రతీకగా నిలిచిన కాకతీయ తోరణాన్ని పటం (మ్యాప్)లో పొందుపర్చింది. ఐదు సరిహద్దులు పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లను పేర్కొంది. పుణ్యక్షేత్రాలను, జాతీయ రహదారులను, విమానాశ్రయాలను పొందుపర్చింది. హైదరాబాదులోని మెట్రో రైలు మార్గాన్ని పొందుపర్చింది.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని ఆయా జిల్లాల కేంద్రాలు, ముఖ్య నగరాల మధ్య దూరాన్ని పేర్కొంది. రైల్వే ట్రాకులను చూపించింది. నల్లమల సరిహద్దులను కూడా గుర్తించింది. తెలంగాణకు చెందిన అధికారిక ముద్రను కూడా సూచించింది.
తెలగాణలోని ముఖ్య ప్రాంతాల్లో కుంతాల జలపాతం, కావల్ వైల్డ్ లైఫ్ సాంచురీ, బాసర, వేములవాడ, జైన్ టెంపుల్, యాదగిరి గుట్ట, గోల్కొండ ఫోర్ట్, జోగులాంబ ఆలయం, ద్రాచలం, ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ సాంచురీ తదితరాలను పేర్కొంది. ఏపీకి చెందిన మ్యాప్ త్వరలో విడుదల కానుంది.












Click it and Unblock the Notifications