అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనసేన, పవన్ కల్యాణ్ పై సర్వే!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. రాజకీయ నాయకులకు ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండటం సహజమే. అయితే ప్రతిసారి తనపట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? తన పార్టీపై ఏమనుకుంటున్నారు? తాను మార్చుకోవల్సిన విషయాలేమైనా ఉన్నాయా? ప్రజల్లో మంచిపేరు సంపాదించాలంటే ఎలా వ్యవహరించాలి?.. తదితర విషయాలపై ఎప్పటికప్పుడు కూలంకుషంగా సర్వేచేసి తెలుసుకుంటూ ఉండాలి.

ఎప్పటికప్పుడు

ఎప్పటికప్పుడు


ప్రజలకు నచ్చనవి ఏమైనా ఉంటే వాటిని తిరస్కరించి మెచ్చే గుణాలను అలవరుచుకుంటూ ముందుకు సాగాలి. ఇది పవన్ కల్యాణ్ కే కాదు.. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు వర్తిస్తుంది. జనసేన పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇటీవల జరిగిన పరిణామాలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించాయి? పవన్ కల్యాణ్ మీద ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు? అనే అంశంపై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సర్వే నిర్వహించాయి. పవన్ కల్యాణ్ గురించి ప్రజల మనసులో ఏముందో తెలుసుకునేందుకు లోపలికి తొంగిచూసే ప్రయత్నం చేశాయి.

 యువతరం ఓటు పవన్ కల్యాణ్

యువతరం ఓటు పవన్ కల్యాణ్


ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పట్ల కొంతవరకు ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఆ ఆశ కేవలం కాపు వర్గంలోనే ఉంది. కాపుల్లో సగం మంది ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అయితే యువతరం మాత్రం పవన్ కు ఓటేస్తామని, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని కోరుకుంటున్నారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇది రివర్స్ అవుతోంది. ఏదో ఒకచోట ఆవేశంగా ప్రసంగించడం.. ఎదుటివారిని విమర్శించడం జరిగితే ఎవరు ఓటేస్తారని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారు

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారు


రాజకీయ నాయకుడన్న తర్వాత ప్రజల మధ్యకు రావాలని, ఇంటి ముందుకు వచ్చి ఓట్లడగాలని, చంద్రబాబు, వైఎస్ జగన్ అదే చేశారని గుర్తుచేస్తున్నారు. సినిమాల్లో నటించి ఆ డబ్బును పార్టీ నడపడానికి ఉపయోగించడం మంచిదేనని, కానీ సినిమాలా? రాజకీయమా? అనే విషయంలో మాత్రం ఏదో ఒకటే నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు. రేపు ఏం చేస్తారు? పవన్ కల్యాణ్ కు ఓటేస్తే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారు అంటున్నారు. దీన్నిబట్టి పవన్ కల్యాణ్ ఎంతో జాగ్రత్త పడాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Janasena chief Pawan Kalyan is saying that he will definitely come to power in the upcoming elections and form the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X