వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిలో అదికారం మ‌ళ్లీ టీడిపిదే..! కాదు కాదు వైసీపి పుంజుకుంది..! చిర్రెత్తిస్తున్న స‌ర్వేలు..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : చూడ‌బోతుంటే స‌ర్వేల సీజ‌న్ న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌యివేటు సంస్థ‌లే కాకుండా జాతీయ మీడియా సంస్థ‌లు కూడా ఈ స‌ర్వేల‌ను నిర్వ‌హిస్తూ త‌మ‌దైన శైలిలో విశ్లేషిస్తున్నాయి. దేశంలో ఎపుడూ ఏదో మూల‌న ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉంటాయి. దీంతో కొంతమంది రాజ‌కీయ నేత‌లు అదేప‌నిగా స‌ర్వేలు చేయించుకుంటూ త్రుప్తి ప‌డుతుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో అయితే మ‌రీ ఘోరంగా ఎన్నిక‌ల గోల లేన‌పుడు కూడా ఉరుము లేని వ‌ర్షంలా స‌ర్వేల ఫ‌లితాలంటూ వ‌చ్చి ప‌డిపోతుంటాయి.

<strong>ఏపీ టీడీపీలో కొత్త ఉత్సాహం, జగన్‌ను 'కేసీఆర్' దెబ్బతీస్తున్నారా, ఇవి సంకేతాలా?</strong>ఏపీ టీడీపీలో కొత్త ఉత్సాహం, జగన్‌ను 'కేసీఆర్' దెబ్బతీస్తున్నారా, ఇవి సంకేతాలా?

స‌ర్వేల‌కు టీఆర్పీ రేటింగులు ఎక్కువ‌గా ఉండ‌టంతో వాటి మీద ఛానెళ్లు కూడా మోజు ప‌డుతున్నాయి. అందుకే ఎవ‌రికి తోచిన‌ట్లు వారు స‌ర్వేలు చేసి జనాల నెత్తి మీద రుద్దేస్తున్నారు. తాజాగా, రెండు స‌ర్వేలు విడుద‌ల అయ్యాయి. అందులో జాతీయ ఫ‌లితాల వాద‌న గురించి ప‌క్క‌న పెడితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి రెండు స‌ర్వేలు రెండు విభిన్న‌మైన ఫ‌లితాల‌ను చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Survey reports are irritating..!Says sometimes tdp, some times opposition party comes into power..!!

ఇక, ఏపీలో టీడిపి హ‌వా ఉంద‌ని, టీడీపీకి 14 సీట్లు, వైసీపీకు 11 సీట్లు వస్తాయని తెలిపింది. మ‌రో స‌ర్వే అబ్బే అలాంటిదేమీ లేదు ఏపిలో అదికార మార్పిడి జ‌ర‌గ‌బోతోంద‌ని జోష్యం చెప్పుకొచ్చింది. అయితే, మ‌రో రెండు గంట‌ల తేడాతో ఇంకో స‌ర్వే వ‌చ్చింది. ఇండియా టీవీ చేయించిన ఈ స‌ర్వేలో గ‌త‌ ఎన్నిక‌ల్లో 8 సీట్ల‌ను గెలిచిన వైసీపీ ఈ ద‌ఫా ఏకంగా 22 సీట్ల‌ను గెలుచుకోనుంద‌ని చెప్పింది. అంటే 14 సీట్లు అద‌నం. అధికార టీడీపీ ఈ ద‌ఫా కేవ‌లం మూడు సీట్లకు ప‌రిమితం కానుంద‌ట‌. ఈ రెండు స‌ర్వేల్లో జ‌న‌సేన పేరు విన‌ప‌డ‌నే లేదు.

ఈ స‌ర్వే కూడా తెలంగాణ‌లో ఎంపీ సీట్లు అత్య‌ధికంగా 14 వ‌ర‌కు టీఆర్ఎస్ గెలుచుకుంటుంద‌ని, ఓ రెండు మాత్రం కాంగ్రెస్ కు వ‌స్తాయ‌ని తేల్చింది. ఈ స‌ర్వేలు ఎవ‌రు ఎపుడు ఎక్క‌డ ఎలా చేస్తున్నారో వెల్ల‌డించ‌రు గాని, ఆఘ‌మేఘాల మీద స‌ర్వే నివేదిక అంటూ చ‌టుక్కున ప్ర‌క‌టిస్తారు. ఇంతటి వైరుధ్యం ఉన్న స‌ర్వేల‌ను చూసిని జ‌నాలు మాత్రం చిరాకు ప‌డిపోతున్న‌ట్టు తెలుస్తోంది. స‌ర్వేల్లో ఏది న‌మ్మాలో, ఏది న‌మ్మ‌కూడ‌దో అర్థం కాక జ‌నాలు చిర్రెత్తి పోతున్న తెలుస్తోంది.

English summary
Freshly two surveys have been released. On the contrary, two surveys say about the Andhra Pradesh Assembly polls have two distinct results. Public irritating those survey results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X