పులివెందులలో గెలుపు వారిదే - జగన్ తాజా లెక్కలిలా..!?
పలివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. ఉద్రిక్తతల మధ్య పోలింగ్ ముగిసింది. రెండు కేంద్రాల్లో రీ పోలింగ్ జరుగుతోంది. వైసీపీ రీ పోలింగ్ ను బహిష్కరించింది. పోలింగ్ తీరును జగన్ తప్పు బట్టారు. ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. టీడీపీ మాత్రం అక్కడ ప్రజాస్వామ్యం గెలిచిందని చెబుతోంది. కాగా, సర్వే సంస్థలు పులివెందుల విజేత ఎవరో స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో జగన్ కు కలిసొచ్చేది ఏంటో వెల్లడిస్తున్నాయి. రేపు ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది.
హోరా హోరీగా
హోరా హోరీగా సాగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక విజేత ఎవరో స్పష్టత వచ్చింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో తొలి సారి ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త వ్యూహాల ను రచించాల్సి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వై నాట్ కుప్పం అంటూ అక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఆ సమయంలో వైసీపీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేసిందని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ వై నాట్ పులివెందుల అంటూ బరిలోకి దిగింది. అన్ని అస్త్రాలను ప్రయోగించింది. ఎన్నికల తీరు పైన వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే, తమ గెలుపు ఖాయమని టీడీపీ చెబుతుంటే... రీ పోలింగ్ నిర్వహించాలని.. కేంద్ర బలగాల మధ్య ఎన్నిక జరగాలని జగన్ డిమాండ్ చేయటం ద్వారా గెలుపు ఎవరిదో స్పష్టం అవుతోంది.

గెలుపు ఎవరిది
అయితే, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు వ్యూహాలను జగన్ ఒక విధంగా ముందుగానే పసిగట్టారు. టీడీపీ పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొనేలా ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. టీడీపీ వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలోకి దించింది. జగన్ సొంత నియోజకవర్గం కావటంతో ఎలాగైనా గెలిచి కుప్పం ఫలితానికి సమాధానం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అన్ని వ్యూహాలను పక్కాగా అమలు చేసింది. కాగా, పోలింగ్ ముందు పరిస్థితి అర్దం చేసుకున్న జగన్ పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. ఎక్కడా ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా.. కేడర్ ను కంట్రోల్ చేయాలని సూచించారు. అదే సమయంలో చోటు చేసుకున్న ఘటనలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యవహరించాలని నిర్దేశించారు.
అదొక్కటే ఛాన్స్
ఇక.. పులివెందుల, ఒంటిమిట్టలో ఎన్నికల జరిగిన తీరుతో తుది ఫలితం ఏంటనేది వైసీపీకి పూర్తి స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఎవరు గెలిచినా.. మరో పది నెలలు మాత్రమే ఈ పదవులు ఆ పార్టీ చేతిలో ఉండనున్నాయి. ఈ ఫలితం కారణంగా జిల్లా పరిషత్ చేజిక్కించుకునే అవకాశం లేదు. అయితే, అధికారంలో ఉన్న టీడీపీ దౌర్జన్యంగా వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లటం ద్వారా డామేజ్ చేయాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగానే వైసీపీ అభ్యర్ధే ఓటు వేయకుండా దూరంగా ఉన్నారు. తానే స్వయంగా పులివెందుల పరిణామాలను వివరించాలని నిర్ణయించారు. భారీ స్థాయిలో పోలీసుల మొహరింపు.. అడ్డగింత వంటి వాటి ద్వారా ఫలితం ఎలా ఉన్నా ప్రజల్లోకి మాత్రం ఎన్నిక జరిగిన తీరు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీని ద్వారా ప్రజల్లో టీడీపీని డామేజ్ చేయటం.. ఎంతో కొంత సానుభూతి పొందటం వైసీపీ వ్యూహంగా ఉంది. తుది ఫలితాల తరువాత రాజకీయంగా ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications