రాజధాని పిటిషన్ల విచారణ అడ్డుకుందెవరు ? ఆలస్యంతో ఎవరికి మేలు ? అసలేం జరిగింది ?

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టు సుదీర్ఘ విరామం తర్వాత నిన్న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించినా వెంటనే వాయిదా వేసేసింది. దీంతో రాజధానుల పిటిషన్ల విచారణ నవంబర్ 15 తర్వాత మొదలు కానుంది. రెగ్యులర్ విచారణ ప్రారంభమైనా వెంటనే వాయిదా పడటంపై పిటిషనర్లతో పాటు ప్రతివాదుల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఈ వాయిదా కోరడం వెనుక ఏం జరిగిందనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఎవరి పాత్ర ఎంత అన్న దానిపై మాటలయుద్ధం సాగుతోంది.

 మూడు రాజధానుల విచారణ

మూడు రాజధానుల విచారణ

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన బిల్లుల్ని వ్యతిరేకిస్తూ గతంలో హైకోర్టులో వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో అమరావతి జేఏసీతో పాటు రైతులు, విపక్ష పార్టీలు, ఇలా పలువురు పిటిషనర్లుగా ఉన్నారు. అలాగే ప్రభుత్వంతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, రాజ్యాంగ సంస్ధలు ప్రతివాదులుగా ఉన్నాయి. గతేడాది హైకోర్టులో ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభమై తుది దిశకు చేరుకున్న నేపథ్యంలో హైకోర్టు సీజే బదిలీ కావడం, ఆ తర్వాత ఈ విచారణ మూలనపడటం జరిగిపోయాయి. తిరిగి కొత్త సీజే ఆధ్వర్యంలో తాజాగా విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అక్కడే ట్విస్ట్ ఎదురైంది.

 రాజధానుల విచారణలో ట్విస్ట్

రాజధానుల విచారణలో ట్విస్ట్

మూడు రాజధానుల కోసం వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన బిల్లుల్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నిన్నటి నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకోసం హైకోర్టు ఫుల్ బెంచ్ కూడా ఏర్పాటైంది. ఇక పిటిషన్లపై విచారణ ప్రారంభం కావడం, రోజువారీ విచారణ జరగడం ఖాయమన్న దశలో భారీ ట్విస్ట్ ఎదురైంది. రాజధాని పిటిషన్లపై విచారణ ప్రారంభం కాగానే ఇరువైపులా న్యాయవాదులు వాయిదాలు కోరడంతో అది కాస్తా నవంబర్ 15కు వాయిదా పడిపోయింది. అక్కడే భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముందుగా ఈ వాయిదా కోరింది ఎవరు ? అయితే హైకోర్టు విచారణ వాయిదా కోసం ఇప్పుడు ఎవరేం కోరారన్న దానిపై చర్చ జరుగుతోంది.

 బొత్స కామెంట్స్ పై అమరావతి జేఏసీ ఫైర్

బొత్స కామెంట్స్ పై అమరావతి జేఏసీ ఫైర్

హైకోర్టులో మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ అర్దాంతరంగా వాయిదా కోరడం వెనుక పిటిషనర్లకు దురుద్దేశాలు ఉన్నాయంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై పిటిషనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స కామెంట్స్ పై స్పందించిన అమరావతి జేఏసీ నేతలు.. వాస్తవాలు తెలుసుకోకుండా బొత్స వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. నవంబర్ 15 తర్వాత రాజధాని పిటిషన్లపై విచారణ కోరింది అడ్వకేట్ జనరలేనని అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. కానీ పిటిషనర్లను తప్పుబడుతూ బొత్స వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. సుప్రీంకోర్టులో అత్యవసర కేసులు ఉన్నందున తాము వారం రోజులు వాయిదా మాత్రమే కోరామని, కానీ ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంలో తమను ఇరికించాలని చూస్తోందన్నారు. వాస్తవానికి అమరావతి రాజధాని వ్యవహారం సాధ్యమైనంత త్వరగా తేలాలని పిటిషనర్లు కోరుకుంటున్నారు. ఇదే అంశాన్ని గతంలోనూ హైకోర్టు దృష్టికి తెచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని సాధ్యమైనంత ఆలస్యం చేయాలని చూస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

Recommended Video

    NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu
     బొత్స వ్యాఖ్యల వెనుక ?

    బొత్స వ్యాఖ్యల వెనుక ?

    హైకోర్టులో మూడు రాజధానుల పిటిషన్లపై రెగ్యులర్ విచారణ ప్రారంభమైన తర్వాత పిటిషనర్ అమరావతి జేఏసీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వేరే పిటిషన్ల విచారణ కారణంగా వారం రోజుల వాయిదా కోరారు. కానీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం మాత్రం సెప్టెంబర్ లో కరోనా ధర్డ్ వేవ్ ఉంటుందని, అక్టోబర్ లో హైకోర్టుకు సెలవులు ఉన్నాయని, అందుకే నవంబర్ 15 తర్వాత ఈ వాజ్యాలపై విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం నవంబర్ 15కు ఈ పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. ఏజీ చెప్పిన ప్రకారం చూస్తే కరోనా కారణంగా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ అందుబాటులో ఉండే అవకాశం లేదు, అక్టోబర్ లో హైకోర్టుకు సెలవుల్లో రోజువారీ విచారణ సాగడం కష్టమే. అందుకే ఆయన నవంబర్ లో విచారణ కావాలని కోరారు. కానీ కోర్టు నుంచి సమాచారం అందుకోవడంలో సమాచార లోపం కారణంగానే బొత్స ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికిప్పుడు ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభమైనా తేలే సరికి చాలా సమయం పడుతుంది. అయినా ఇప్పటికిప్పుడు రాజధాని తరలించే పరిస్దితి కూడా లేదు. దీంతో ప్రభుత్వం విచారణ ఆలస్యమైనా పర్వాలేదని భావించి ఉండొచ్చని తెలుస్తోంది. అందుకే రాజధాని పిటిషన్ల విచారణ నవంబర్ 15 తర్వాత చేపట్టాలని ప్రభుత్వం కోరినట్లు అర్దమవుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+