వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా చూడని న్యాయమూర్తులు! లక్ష్మీస్ ఎన్టీఆర్.. మరో వాయిదా! అక్కడ మాత్రం శాశ్వత నిషేధం

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న ఎన్నికల వాతావరణం ఎఫెక్ట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించట్లేదు. ఈ సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు.. తన తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. కేసు విచారణలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తులు బుధవారం ఉదయం సినిమా చూడాల్సి ఉంది. అలా జరగలేదు. సినిమాను చూడటానికి న్యాయమూర్తులు నిరాకరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున తాము సినిమాను చూడలేమని, తదుపరి విచారణను కొనసాగించలేమని స్పష్టం చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.

<strong>ఏ లగ్నాన పుట్టారో గానీ..పనికి మాలిన వ్యక్తి మోడీ: పులివెందులలో చెడపుట్టిన వ్యక్తి జగన్: చంద్రబాబు </strong>ఏ లగ్నాన పుట్టారో గానీ..పనికి మాలిన వ్యక్తి మోడీ: పులివెందులలో చెడపుట్టిన వ్యక్తి జగన్: చంద్రబాబు

మూవీపై పొలిటికల్ హీట్ ఎఫెక్ట్

మూవీపై పొలిటికల్ హీట్ ఎఫెక్ట్

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో పోలింగ్ కొనసాగనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రధాన విలన్ గా చూపించినట్లు మొదటి నుంచీ వార్తలు వస్తున్నాయి. ఎన్నికల వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను రాష్ట్రంలో విడుదల చేస్తే.. అధికారంలో ఉన్న తెలుగుదేశానికి ప్రతికూలంగా మారుతుందనే ఉద్దేశంతో ఆ పార్టీ నాయకులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలను నిషేధించాలని కోరారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు తీసుకుంది. తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉండటంతో సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించింది. ఏపీలో మినహా అన్ని చోట్లా సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది.

సుప్రీంకోర్టు మెట్లెక్కిన మూవీ..

సుప్రీంకోర్టు మెట్లెక్కిన మూవీ..

ఏపీలో విడుదల చేయడానికి అవసరమైన ఉత్తర్వులను సినిమా చూసిన తరువాతే జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. దీనితో- ముందుగా నిర్దేశించిన సమయం ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు బుధవారం ఉదయం 10 గంటలకు సినిమాను తిలకించాల్సి ఉంది. ఈలోగా- లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేయాలని, స్టే కొనసాగితే.. తాము ఆర్థికంగా నష్టపోతామని అంటూ ఏపీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం తరఫున నిర్మాత నట్టికుమార్, మూవీ నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఈ పరిస్థితుల్లో సినిమా చూడలేం..

ఈ పరిస్థితుల్లో సినిమా చూడలేం..

ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. దీనితో- ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు ఇంకా రావాల్సి ఉన్నందున.. తాము సినిమాను చూడలేమని, స్టే ఎత్తివేతపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేమని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కేసు తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేశారు.

సానుకూల తీర్పు ఆశించినా..

సానుకూల తీర్పు ఆశించినా..

సినిమా విడుదల విషయంలో తమకు అనుకూలంగా తీర్పు వెలువడుతుందని తాము ఆశించామని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే చిత్రయూనిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సినిమా విడుదల కాకపోవటంతో తమకు నష్టాలు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్ల హైకోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా దర్శకత్వం వహించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైన విషయం తెలిసిందే.

ఫిల్మ్ నగర్ లో సినిమా ప్రదర్శనపై శాశ్వత నిషేధం

ఫిల్మ్ నగర్ లో సినిమా ప్రదర్శనపై శాశ్వత నిషేధం

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ శాశ్వత నిషేధాన్ని విధించింది. ఇకపై ఈ సినిమా కల్చరల్ సెంటర్ లో ప్రదర్శనకు నోచుకోదు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించబోమని కల్చరల్ సెంటర్ నిర్ణయం తీసుకుంది.
కొత్తగా విడుదలైన సినిమాను ప్రతి శనివారం ఈ జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా- దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రం రూపొందింన `కథానాయకుడు`, `మహానాయకుడు` బయోపిక్ సినిమాలను ఈ కల్చరల్ సెంటర్ లో ప్రదర్శించారు కూడా. మరో బయోపిక్ గా విడుదలైన `లక్ష్మీస్ ఎన్టీఆర్` మూవీని మాత్రం కల్చరల్ సెంటర్ కమిటీలోని ఓ వర్గం సభ్యులు అడ్డుకోవడంతో అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది.

సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయినా.. చివరి నిమిషంలో..

సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయినా.. చివరి నిమిషంలో..

నిజానికి- లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో శుక్రవారం ప్రదర్శించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కూడా. అదే సమయంలో కల్చరల్ సెంటర్ సభ్యుల్లో ఓ వర్గానికి చెందిన ప్రతినిధులు దీన్ని అడ్డుకున్నారు. సినిమాను ప్రదర్శించకూడదని, నిషేధం విధించాలని పట్టుబట్టారు. దీనితో కల్చరల్ సెంటర్ ఛైర్మన్ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. పైగా శాశ్వతంగా సినిమా ప్రదర్శనను నిషేధించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Suspense on Lakshmi's NTR Movie, directed by Ram Gopal Varma release in Andhra Pradesh is continue. High Court of Andhra Pradesh Bench constituted Justice was not seen the Movie, which Scheduled on Wednesday. High Court postponed this Petition on 9th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X