మెడపై ఆయిల్ పూసి!: హత్యేనా?, బాబాయి, కూతురు అనుమానాస్పద మృతి!
బలవంతంగా అతనిని కట్టేసి ఏదైనా కూల్‌డ్రింక్‌లో సైనేడ్ కలిపి తాగించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు: గుంటూరు జిల్లాలోని అమృతలూరులో ఓ బాలిక, ఆమె బాబాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. సంఘటన తీరు చూస్తే.. ఇది హత్యే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అమృతలూరు-పెదపూడి గ్రామాల మధ్య తెనాలి-చెరుకుపల్లి ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం అటు పక్కగా వెళ్లిన కొంతమందికి మృతదేహాలు కంటపడటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

నేపథ్యం:
అమృతలూరుకు చెందిన రాపర్ల సుబ్బి కృష్ణ, ఝాన్సీవల్లి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సురేష్ బాబుకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమారుడు సతీష్‌కు కొన్ని నెలల క్రితమే వివాహం జరిగింది.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాపర్ల సతీష్‌కు, యలవర్రులో ఎస్సీ మాల వర్గానికి చెందిన సజనకుమారితో పెద్దలు వివాహం జరపించారు. అయితే భార్యతో తలెత్తిన విభేదాల కారణంగా అతని కాపురం సజావుగా సాగడం లేదని తెలుస్తోంది. కొంతకాలంగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం.
గత కొన్నేళ్లుగా సతీష్, సురేష్ ఇద్దరూ గ్రామ దేవత పుట్లమ్మ తల్లిగుడి పక్కనే ఉన్న షాపును అద్దెకు తీసుకొని ఎరువులు, పురుగు మందుల దుకాణ వ్యాపారం సాగిస్తున్నారు.

చరితాచౌదరి అంటే ఎనలేని ప్రేమ:
సతీష్‌కు అన్న రెండో కుమార్తె చరితాచౌదరి అంటే చాలా ప్రేమ. ఎప్పుడూ ఆమెతో గడపడానికే ఇష్టపడేవాడు. ఎక్కడికెళ్లినా ఆమెను వెంట తీసుకెళ్లేవాడు. ఇదే క్రమంలో తమ ఎరువుల షాపుకు సంబంధించి తెనాలిలో ఆడిట్ ఉందని, అలాగే దీపావళి టపాసులు కొనుక్కొస్తానని చెప్పి చరితను తీసుకుని సోమవారం సాయంత్రం వెళ్లాడు. అయితే అర్థరాత్రి కావొచ్చినా ఇద్దరూ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. పలు చోట్ల వెతికినా లాభం లేకుండా పోయింది. ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో ఎక్కడికెళ్లారో అర్థం కాలేదు.
Recommended Video


వైన్ షాపు వద్ద మృతదేహాలు:
పెదపూడి గ్రామాల మధ్యలో మూసేసిన ఓ వైన్ షాపు దుకాణం వద్ద బాలిక మృతదేహం, షాపు ముందు సతీష్ మృతదేహాలను స్థానికులు గుర్తించారు. విషయం కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతుడు సతీష్ వద్ద ఒక బ్లేడు, కొంత నగదు, సెల్‌ఫోన్ గుర్తించారు.

హత్యేనా?, మెడ చుట్టూ ఆయిల్:
సతీష్ చేతిపై బ్లేడుతో కోసిన గాట్లు ఉండటంతో ఇది హత్యా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బలవంతంగా అతనిని కట్టేసి ఏదైనా కూల్‌డ్రింక్‌లో సైనేడ్ కలిపి తాగించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులిద్దరి మెడలపై నల్లటి ఆయిల్ పూసి ఉండటం గమనార్హం.
గుర్తు పడుతుందేమోనన్న భయంతోనే పసి పిల్ల అని కూడా చూడకుండా చరితను కూడా దుండగులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications