వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుమారం రేపుతున్న వీడియో.. పోలీసులకు 30 ఇయర్స్ పృథ్వీ ఫిర్యాదు..

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది జనవరిలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి నటుడు పృథ్వీ రాజ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన ఓ టిక్‌టాక్ వీడియో కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. పృథ్వీ కాకతాళీయంగా అన్నారో.. మరేమో గానీ.. ప్రత్యర్థి పార్టీ ఆ వీడియోను ఇప్పుడో అస్త్రంగా మార్చుకుంటోంది. సోషల్ మీడియాలో ఇది పెద్ద దుమారమే రేపుతుండటంతో పృథ్వీ సైబర్ పోలీసులను ఆశ్రయించారు.

30 ఇయర్స్ పృథ్వీ కేసు

30 ఇయర్స్ పృథ్వీ కేసు

టిక్‌టాక్‌తో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో తన వీడియోలను ఎడిట్ చేసి కించపరుస్తున్నారని పృథ్వీరాజ్ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా తన వీడియోలను సోషల్ మీడియాలో ఎడిట్ చేసి.. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగింది..


తాజాగా పృథ్వీ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 'మన అని ఎవరినీ నమ్మొద్దు. ఎందుకంటే ఇది తాతల నాటి యుగం కాదు. కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం. మన ముందు మన మాట మాట్లాడతారు. వాడి ముందు వాడి మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.' అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో పృథ్వీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. కాకతాళీయంగానే ఆయన నోటి వెంట ఈ వ్యాఖ్యలు వచ్చాయా.. లేక రాజకీయ ఉద్దేశంతోనే చేశారా అన్న చర్చ జరుగుతోంది.

Recommended Video

Lockdown Lifting In AP || కరోనా వైరస్ వ్యాప్తిని ఎప్పటికీ కంట్రోల్ చెయ్యలేం : సీఎం జగన్
జగన్‌నే టార్గెట్ చేశారని..!!

జగన్‌నే టార్గెట్ చేశారని..!!


పృథ్వీ చేసిన ఈ వీడియో ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. కల్తీ నా కొడుకులు అంటే ఎవరో అని పలువురు టీడీపీ మద్దతుదారులు ఈ వీడియోపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈయన వైసీపీ నుంచి ఎప్పుడు బయటకొచ్చారో అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. 'కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం' అని పృథ్వీ వ్యాఖ్యానించారంటే... అది జగన్‌ను ఉద్దేశించే అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పృథ్వీ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడో గానీ.. మొత్తానికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికైతే ఆ వ్యాఖ్యలపై ఆయన స్పష్టనితవ్వలేదు. అయితే తన వీడియోలను ఎడిట్ చేసి కించపరుస్తున్నారని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చూడాలి మరి.. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో..!

English summary
SVBC chairman Prudhvi Raj filed a complaint in cyber police station in Hyderabad for trolling his videos in social media from last few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X