వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిల్మ్ సిటీలా, రైతులా?: కేసీఆర్‌పై అగ్నివేష్ ప్రశ్నల వర్షం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫిల్మ్ సిటీలు కావాలా లేక రైతుల ఆత్మహత్యలు ఆపడం కావాలా అని తెలంగాణ సర్కారు పైన స్వామి అగ్నివేష్ శనివారం నాడు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆత్మహత్యల పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మౌనం ఎందుకన్నారు. అలాగే మోడీత్వం మంచిది కాదన్నారు.

తెలంగాణలో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కేసీఆర్‌ వీటిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని, తెలంగాణలో ఫిల్మ్‌సిటీ నిర్మిస్తున్న కేసీఆర్‌కు ఆత్మహత్యలు కనిపించటం లేదా, ఫిల్మ్‌ సిటీ నిర్మించినంత మాత్రాన రైతుల ఆత్మహత్యలు ఆగి పోతాయా అని అగ్నివేశ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

అన్ని పనులూ పక్కనపెట్టి రైతు ఆత్మహత్య లు జరగకుండా మంచి ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ మహాసభలు మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన శనివారం ప్రారంభమయ్యాయి.

తెలంగాణ విద్యావంతుల వేదిక

తెలంగాణ విద్యావంతుల వేదిక

కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన అగ్నివేశ్‌ మాట్లాడారు. ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా తెలంగాణలో స్వరాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగాయని, ఇందులో తాను కూడా పాల్గొన్నానన్నారు.

 తెలంగాణ విద్యావంతుల వేదిక

తెలంగాణ విద్యావంతుల వేదిక

తెలంగాణఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా పాల్గొంటానని ప్రకటించారు. విద్యావంతుల వేదిక ప్రభుత్వానికి విమర్శనాత్మక సూచనలు చేస్తూనే స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక

తెలంగాణ విద్యావంతుల వేదిక

సారా నిషేధ ఉద్యమం మళ్లీ తెలంగాణలో ప్రారంభంకావాల్సి ఉందని, ఇందుకు ప్రజలు సిద్ధం కావాలని అగ్నివేష్ పిలుపునిచ్చారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక

తెలంగాణ విద్యావంతుల వేదిక

కోదండరాం నేటి గాంధీ అని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పని చేశారని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఎలాంటి పదవుల జోలికీ వెళ్లకుండా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేస్తున్నారని కితాబిచ్చారు.

 తెలంగాణ విద్యావంతుల వేదిక

తెలంగాణ విద్యావంతుల వేదిక

పోలిటికల్‌ పవర్‌, పీపుల్స్‌ పవర్‌ మధ్య సమన్వయం ఏర్పడితేనే తెలంగాణ అభివృద్ధి దిశగా పయనిస్తోందని అగ్నివేష్ అన్నారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక

తెలంగాణ విద్యావంతుల వేదిక

ప్రభుత్వ టీచర్లు ప్రైవేటు టీచర్లకంటే ఎక్కువ వేతనాలు పొందుతున్నారని, ఫలితాలు మాత్రం ప్రైవేటు స్కూళ్ల కంటే తక్కువగా ఉంటున్నాయని అగ్నివేశ్‌ అన్నారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక

తెలంగాణ విద్యావంతుల వేదిక

పుట్టిన ప్రతి శిశువు హిందువే అని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌, కాదు... ముస్లిం అని ఒవైసీ అంటున్నారని, ప్రజలను మతాల పేరుతో పంచుకుంటున్నారని అగ్నివేష్ అన్నారు.

 తెలంగాణ విద్యావంతుల వేదిక

తెలంగాణ విద్యావంతుల వేదిక

మనిషి వారసుడిని మానిషిగా చూడాలి కానీ మతం కోణంలో కా దన్నారు. కుల రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. కొన్ని నెలలపాటు తెలంగాణలో ఉండి ప్రజలను చైతన్య వంతులు చే సేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

English summary
Swami Agnivesh questions Telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X