జనసేనలోకి స్వామినాయుడు, ఫ్యాన్స్: చిరంజీవితో భేటీ అయ్యాకే? పవన్ హామీ

Recommended Video

    జనసేన లోకి చిరు ఫాన్స్

    విశాఖపట్నం/హైదరాబాద్/అమరావతి: జనసేన పార్టీలోకి చిరంజీవి అభిమానులు చేరుతున్నారు. ఈ నెల 9వ తేదీన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ స్వామినాయుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరనున్నారు. ఆయన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

    తాజాగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్వామినాయుడుతో పాటు కాంగ్రెస్ పార్టీకి మరికొందరు చిరంజీవి అభిమానులు రాజీనామా చేశారు. వీరంతా పవన్ కళ్యాణ్ వెంట నడవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి అభిమానులుగా ఉన్న చాలామంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, స్వామినాయుడు వెంట నడవనున్నారు.

     2019లో జనసేనాని వెంటే చిరంజీవి అభిమానులు

    2019లో జనసేనాని వెంటే చిరంజీవి అభిమానులు

    ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం, పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం తెలిసిందే. పార్టీని విలీనం చేసిన తర్వాత ఆయనను అధిష్టానం రాజ్యసభకు పంపించింది. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికినా, చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నా.. జనసేన పోటీ చేయలేదు కాబట్టి పెద్దగా చర్చ జరగలేదు. కానీ 2019లో జనసేన పోటీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఎటువైపు ఉంటారనే చర్చ సాగింది.

     చిరంజీవి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నా మెగా ఫ్యామిలీ వెంటే

    చిరంజీవి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నా మెగా ఫ్యామిలీ వెంటే

    ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామినాయుడు సహా చిరు అభిమానులు జనసేనలో చేరడం కీలక పరిణామం. నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, సాయి ధరమ్ తేజ వంటి మెగా కుటుంబ సభ్యులు జనసేనానికి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు.

    చిరంజీవితో భేటీ తర్వాతే!

    చిరంజీవితో భేటీ తర్వాతే!

    ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానులు కూడా జనసేనాని వెంట నడుస్తున్నారు. జనసేనలో చేరే అంశంపై స్వామినాయుడు.. రెండు మూడు రోజుల క్రితం చిరంజీవితో చర్చించారని తెలుస్తోంది. ఈ చర్చలలో రాజకీయపరమైన నిర్ణయాన్ని చిరంజీవి ఆయనకు వదిలేశారని తెలుస్తోంది. చిరంజీవిసమ్మతించారని కూడా అంటున్నారు. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ పవన్‌కు అండగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. చిరంజీవి మౌనంగా ఉన్నా అభిమానులు తమ్ముడి వెంట ఉంటారు.

    చిరు అభిమానులకు పవన్ హామీ!

    చిరు అభిమానులకు పవన్ హామీ!

    చిరంజీవి అభిమానులు జనసేనలో చేరే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తున్నారు. వీరందరినీ ఉద్దేశించి పవన్ మాట్లాడుతారు. చిరంజీవి యువత కేడర్‍‌కు ప్రాధాన్యతను ఇచ్చేందుకు పవన్ అంగీకరించారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం స్వామినాయుడు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+