జగన్ సర్కార్ కు ఉగాది నాడు గుడ్ న్యూస్ చెప్పిన సాత్మానందేంద్ర-అదే జరిగితే భారీ ఊరట
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద చెప్పే విషయాలపై వైఎస్ జగన్ కు గురి ఎక్కువ. ఆయన ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చానని జగన్ భావిస్తుంటారు. ఆయన చెప్పింది చెప్పినట్లే చేస్తుంటారు. తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రకటించిన ముహుర్తం కూడా స్వరూపానంద పెట్టిందేననన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఉగాది రోజున సీఎం జగన్ కు స్వరూపానంద శిష్యుడైన సాత్మానందేంద్ర మరో గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రస్తుతం ఏపీ ఆర్ధిక పరిస్ధితి దారుణంగా ఉంది. అప్పులు తెచ్చి మరీ ఉద్యోగాలకు జీతాలు చెల్లించేదాకా వచ్చింది. అయినా అప్పులు కూడా సరిపోవడం లేదు. దీంతో ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాల చెల్లింపుపై భ్రమలు కాస్తా తొలగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తెలుగు సంవత్సరంలో ఏపీ ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి బావుతుందని స్వామి సాత్మానందేంద్ర అంచనా వేస్తున్నారు. ఇవాళ విశాఖ శారదాపీఠంలో జరిగిన ఉగాది పంచాగ శ్రవణం సందర్బంగా స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ శ్రీ విశాఖ శారదా పీఠంలో తెన్నేటి శ్రీనివాస శర్మ ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు విశాఖ శారదా పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. సంవత్సరం ప్రారంభమే కాలసర్ప దోషముతో మొదలు కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఒత్తిడికి లోనవుతాయన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది తీవ్ర ఎండలు ఉంటాయని.. అలాగే వర్షాలు కూడా అధికంగా కురుస్తాయన్నారు. వర్షాలు అధికంగా కురిసినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. దేశ సరిహద్దులలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని స్వాత్మానందేంద్ర వెల్లడించారు.












Click it and Unblock the Notifications