'హేవళంబి'లో రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే వారికి గడ్డుకాలమే!: స్వరూపనందేంద్ర

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ఉగాది పండుగ వస్తుందంటే చాలు జ్యోతిష్కులు, పీఠాధిపతులు పంచాంగ శ్రవణం వినిపించడం షరా మామూలే. ఈ క్రమంలో సినిమాలు, రాజకీయాల గురించి వారు చేసే వ్యాఖ్యలు కొన్ని వివాదస్పదం కూడా అవుతుంటాయి. నేతల రాజకీయ భవిష్యత్తు గురించి, సినీ తారల వెండితెర మలుపుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు.

తాజాగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రాజకీయాలను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే హేవళింబి నామ సంవత్సరంలో దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే వ్యక్తులకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. రాజకీయ నేతలకు కొత్త ఏడాది గడ్డు కాలమని చెప్పారు.

Swami Swaroopanandendra Saraswati comments on up coming politics

ప్రభుత్వం విజ్ఞతతో యజ్ఞయాగాలు చేయిస్తే మేలు జరుగుతుందని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కాలసర్ప దోషం ఉందని చెప్పుకొచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Swami Swaroopanandendra Saraswati made some interesting comments on state and national politics. He said coming days are very difficult for state and national rulers
Please Wait while comments are loading...