4గురు మృతి: స్వైన్‌ఫ్లూపై కేసీఆర్ ఆందోళన, మోడీ సాయం కోరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆందోళన వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూతో హైదరాబాద్ నగరాన్ని ఠారెత్తిస్తోంది. రెండు రోజుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. దీంతో కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూ పైన చర్చిచేందుకు సాయంత్రం కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
హైదరాబాదులో నెలకొన్న స్వైన్ ఫ్లూ పరిస్థితిపై కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఫోన్ చేసి వివరించారు. వైద్య సాయం కోసం వైద్య బృందాలని పంపాలని ఆయన కోరారు. వెంటనే ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించేందుకు ప్రధాని మోడీ అంగీకరించారు. ఆయనకు కేసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సమన్వయం చేసి సహకరించాలని కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలను కేసీఆర్ కోరారు.
స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. సీఎస్ రాజీవ్ శర్మతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్వైన్ ఫ్లూ పరిస్థితులపై ఇవాళ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్వైన్ ఫ్లూ ప్రబలుతున్నా వైద్య ఆరోగ్య శాఖ స్తబ్దుగా ఉండటంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వైన్‌ఫ్లూ
స్వైన్ ఫ్లూ వల్ల సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు తెలంగాణలో నమోదయ్యాయి.

స్వైన్‌ఫ్లూ
హైదరాబాద్‌లో ఈ నెలలో సోమవారం నాటికి ఏడు స్వైన్ ఫ్లూ మరణాలు నమోదయ్యాయి తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు, మరో ఇద్దరు మంగళవారం చనిపోయారు.

స్వైన్‌ఫ్లూ
దీంతో ఈ నెలలో ఇప్పటికి పదకొండు మంది స్వైన్‌ఫ్లూతో మృతి చెందినట్టయింది. మంగళవారం చనిపోయినవారిలో ఒకరు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన 38 సంవత్సరాల వ్యక్తి.

స్వైన్‌ఫ్లూ
ఈ నెల 13న స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఉస్మానియాకు వచ్చారు. వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయగా హెచ్1ఎన్1 వైరస్ సోకిందని తేలడంతో చికిత్స చేస్తున్నప్పటికీ పరిస్థితి విషమించి మంగళవారం చనిపోయారు.

స్వైన్‌ఫ్లూ
మరొకరు ఆసిఫ్ నగర్‌కు చెందిన 40 సంవత్సరాల గృహిణి. ఆమె సోమవారమే ఉస్మానియాలో చేరారు. మంగళవారం చనిపోయారు.

స్వైన్‌ఫ్లూ
ఇక, గాంధీ ఆస్పత్రిలో జీడిమెట్లకు చెందిన 36 సంవత్సరాల మహిళ, శాంతి నగర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి మంగళవారం మృతి చెందారు.

స్వైన్‌ఫ్లూ
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 22 మంది, ఉస్మానియాలో ఒకరు స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. రెండు ఆస్పత్రుల్లో కలిపి మరో 35 మందికి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయి.

స్వైన్‌ఫ్లూ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెలలోనే స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య 187కు చేరింది. గాంధీలో ఇద్దరు, ఉస్మానియాలో ఒకరు చొప్పున ముగ్గురు జూనియర్ డాక్టర్లు సైతం స్వైన్ ఫ్లూ బారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

స్వైన్‌ఫ్లూ
ఈ నేపథ్యంలో స్వైన్‌ఫ్లూను అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీజేఎల్పీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ ప్రభుత్వాన్ని కోరారు.

స్వైన్‌ఫ్లూ
స్వైన్ ఫ్లూ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీఐ నేత నారాయణ సూచించారు. మంగళవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఆయన ఆస్పత్రిలోని స్వైన్ ఫ్లూ రోగుల్ని పరామర్శించారు.

స్వైన్‌ఫ్లూ
వారికి మెరుగైన సేవలందించాలని, మందులు ఉచితంగా పంపిణీ చేయాలని వైద్యులను కోరారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గాంధీ ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

స్వైన్‌ఫ్లూ
కాగా, స్వైన్‌ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. తుమ్ము, దగ్గు స్రావాల ద్వారా ప్రధానంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

స్వైన్‌ఫ్లూ
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆందోళన వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూతో హైదరాబాద్ నగరాన్ని ఠారెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications