గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

16 గంటలు క్షణమొక యుగం: విశ్వకాంత్ ఫ్యామిలీ హ్యాపీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గల లిండ్‌కేఫ్‌లో సోమవారం ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న గుంటూరు నగరానికి చెందిన విశ్వకాంత్ క్షేమంగా బయటపడటంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. 16 గంటల పాటు తమ బిడ్డ ప్రాణాలతో బయటపడతాడో లేదోనని క్షణమొక యుగంలా గడిపిన ఆ తల్లిదండ్రుల్లో విశ్వకాంత్ క్షేమ సమాచారం ఊపిరూదింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం, భారత ప్రభుత్వ అధికారుల సహకారంతో తాము విశ్వసించినట్లుగానే విశ్వకాంత్ క్షేమంగా బయటపడటం పట్ల తల్లిదండ్రులు కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు.

మొదట్లో తమ బిడ్డను ఉగ్రవాదులు బంధించినట్లు తెలియడంతో గుండె ఆగినంతపనైందని, అయితే తాము మొదట్నుంచి అందరి సహకారంతో క్షేమంగానే బయటపడతాడని విశ్వసించానని తండ్రి ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. మార్చి నెలలో తాము సిడ్నీ వెళ్లాలనుకుంటుండగా ఇంతలో విశ్వకాంత్‌తో సహా 30 మందిని ఉగ్రవాదులు బంధించినట్లు తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యామన్నారు.

తమ కోడలు శిల్పకు ఆస్ట్రేలియా అధికారులు గంట గంటకు ఫోన్‌చేసి ధైర్యం చెప్పారని, విశ్వకాంత్‌ను క్షేమంగా తీసుకువస్తామని భరోసా ఇచ్చారన్నారు. విశ్వానికి కాంతి ప్రసరింపజేసేలా ఎదగాలన్న ఉద్దేశంతోనే తన కొడుకుకు విశ్వకాంత్ అని పేరుపెట్టామని, దేశానికి సేవ చేయాలన్న తలంపు దిశగానే సరస్వతీ శిశుమందిర్, కోరుకొండ సైనిక స్కూలులో చదివించామని తెలిపారు. అయితే ఆస్ట్రేలియాలో స్థిరపడటం కొంత బాధకల్గించినప్పటికీ ఊహించని విధంగా ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకుని ప్రాణాలతో దక్కడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు.

తల్లి నిరీక్షణ

తల్లి నిరీక్షణ

సిడ్నీ కేఫ్‌లో తన కుమారుడు విశ్వకాంత్ అంకిరెడ్డి బందీ కావడంతో తల్లి సులోచన మనసు ఆక్రోశించింది. తన కుమారుడి కోసం 16 గంటల పాటు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూసింది.

అయిదేళ్ల క్రితం పెళ్లి

అయిదేళ్ల క్రితం పెళ్లి

గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన బొంతు గురువా రెడ్డి పెద్ద కూతురు శిల్పారెడ్డి వివాహం అయిదేళ్ల క్రితం విశ్వకాంత్ రెడ్డితో జరిగింది. కొన్నాళ్లు గుంటూరులో ఉన్న తర్వాత దంపతులు సిడ్నీ వెళ్లారు.

తండ్రి కృతజ్ఞతలు

తండ్రి కృతజ్ఞతలు

14 గంటల పాటు తాము క్షణమొక యుగంగా గడిపామని, ఎట్టకేలకు ఆస్ట్రేలియా కమాండోల సాహసోపేత చర్యతో తమ టెన్షన్‌కు తెరపడిందంటూ విశ్వకాంత్ తండ్రి ఈశ్వర్ రెడ్డి చెప్పారు. అందరికీ కృతజ్ఝతలు తెలిపారు.

విశ్వకాంత్ రెడ్డి పరుగెత్తుతూ...

విశ్వకాంత్ రెడ్డి పరుగెత్తుతూ...

కమెండోలు ఆపరేషన్ చేపట్టిన తర్వాత 16 గంటల పాటు సిడ్నీ కేఫ్‌లో బందీగా ఉన్న విశ్వకాంత్ రెడ్డి లోపలి నుంచి పరుగుతెత్తుతూ బయటకు రావడం టీవీ చానెళ్లలో కనిపించింది.

English summary
The mood of sorrow turned into happiness in Sampath Nagar of Guntur city on Monday night with the safe return of Viswakanth Ankireddy from the captivity of extremists. Parents Eswar Reddy and Sulochana, along with relatives and friends, expressed happiness over the safe return of Viswakanth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X