మెట్రోపై స్పష్టత ఏది: కెసిఆర్‌కు జానా, ప్రజల్లోకి గద్దర్

 T Govt gives no clarity on Metro: Jana Reddy
హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఆయన శనివారం సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టుపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు.

మెట్రోకు కేటాయించిన స్థలం వారి వద్దే ఉందని ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని జానారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మెట్రో యాజమాన్యం కూడా ఈ స్థలంపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదని అన్నారు. మెట్రో ప్రాజెక్టు కొనసాగింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జానారెడ్డి అన్నారు. మెట్రోకు ఎలాంటి అవాంతరాలు లేవని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెట్రో ఫైళ్లన్నీ అఖిలపక్షం ముందు పెట్టాలని అన్నారు.

ప్రజల్లోకి వస్తాం: గద్దర్

ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు ఎన్నికల మెనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 25శాతం అమలు చేసినా విజయం సాధించినట్లేనని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఆయన శనివారం మెదక్ జిల్లాలోని హల్దీ డ్యాం ఎత్తు పెంచాలని కోరుతూ సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావును కలిసి వినతి పత్రం సమర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఒక్క నీటి చుక్క ఒక్క అంగుళం భూమి వృధా కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అభివృద్ధి యాత్ర పేరుతో త్వరలోనే ప్రజల్లోకి వస్తామని గద్దర్ ప్రకటించారు. ఉద్యమంలో విద్యార్థులు, యువకులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+