కాంగ్రెస్‌లో టిక్కెట్లు ఇస్తాం రండి: దిగ్విజయ్‌కి కోదండ నో

డిగ్గీని కలిసిన జెఏసి నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెసు పార్టీకి, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం మంచిదేనని, ముసాయిదా బిల్లులో పెట్టిన ఆంక్షలు తమకు సమ్మతం కాదని ఆయనకు తెలిపారు.
ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు, గవర్నర్‌కు శాంతిభద్రతల భాద్యత అఫ్పగించడం, నీటి ప్రాజెక్టుల అజమాయిషీకి ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయడం, విద్యపై ఉమ్మడి హక్కు కల్పించడంపై తమకు అభ్యంతరాలున్నాయన్నారు. తాము కొన్ని సవరణలు ప్రతిపాదిస్తామని, వాటిపై సానుకూలంగా స్పందించాలని కోరారు.
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ప్రజలు ఉద్యమకారులు సహకరించాలని డిగ్గీ వారిని కోరారు. దానికి జెఏసి నేతలు అంగీకరించారు.
ఇదే సమయంలో ఉద్యమకారులు రాజకీయాల్లోకి రావాలని కోరారు. కాంగ్రెసు పార్టీలోకి వస్తే టిక్కెట్ ఇస్తామని చెప్పారు. దీనిపై కోదండరామ్ స్పందిస్తూ.. తాము ముసాయిదా బిల్లులో సవరణల కోసమే వచ్చామని, తమకు రాజకీయాలపై ఆసక్తిలేదని, తెలంగాణ ముఖ్యమని చెప్పారు.












Click it and Unblock the Notifications