టీ టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి: టిడిపికి కృష్ణయ్య దూరం?

T TDLP leader Dayakar Rao, Krishanaiah may distance
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎర్రబెల్లి దయాకర్ రావు నియమితులయ్యారు. ఉప సభా నాయకులుగా అనుముల రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు ఎంపికయ్యారు. తొలుత ఉప సభా నాయకుడిగా తలసాని శ్రీనివాస యాదవ్‌కి అవకాశం కల్పించినప్పటికీ ఆయన ఆ పదవిని నిరాకరించారు. దీంతో ఆయన స్థానంలో సండ్ర వెంకట వీరయ్యకు అవకాశం కల్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ముందుగా నిర్ణయించినట్లుగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీ విప్‌గా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి రెండో పర్యాయం ఎన్నికైన ప్రకాష్ గౌడ్ పేరుని ప్రకటించారు. అలాగే కార్యదర్శులుగా జి. సాయన్న, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలను ఎంపిక చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మాగంటి గోపీనాథ్‌ని కోశాధికారిగా నియమించారు.

ఈ స్థితిలో ఎల్బీనగర్ శాసనసభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. తేలుగుదేశం శాసనసభ్యులతో ఆయన అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య పేరును పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రకటించారు.

ఆర్. కృష్ణయ్య తొలిసారి తెలంగాణ శాసనసభలోకి అడుగు పెట్టారు. ఆయన సభలో అడుగు పెట్టినప్పటి నుంచి టిడిపి సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, రేవంత్ రెడ్డి ఎదురుపడినా మిన్నకుండి పోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ముందుకు తెచ్చిన నేపథ్యంలో తనకు టిడిఎల్పీ నేత పదవి దక్కుతుందని కృష్ణయ్య భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జరిగింది. పైగా, టిడిఎల్పీలో ఏ పదవీ ఆయనకు దక్కలేదు. టిడిపి కండువా కూడా కృష్ణయ్య కప్పుకోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+