టిపై 4 రాష్ట్రాల ప్రభావం ఉండదు: డిగ్గీ, సీమాంధ్ర ఆగ్రహం

విస్మరించారు: హర్షకుమార్
విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ పెద్దలు తమను విస్మరించారని అమలాపురం ఎంపి హర్ష కుమార్ ఢిల్లీలో వేరుగా అన్నారు. విభజనపై ఆంటోని కమిటీని, మంత్రుల బృందాన్ని (జివోఎం) కంటితుడుపు చర్యగా వేశారన్నారు. తాను కాంగ్రెసు పార్టీలోనే పుట్టానని, ఇందులోనే ఉంటానని చెప్పారు.
సున్నితమైన అంశం: గంటా
సున్నితమైన విభజన అంశాన్ని టేబుల్ ఐటెంగా తీసుకు రావడం సరికాదని మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖపట్నంలో అన్నారు. విభజనను 65 శాతం మంది ప్రజలు ధిక్కరిస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరు విభజన బిల్లును అడ్డుకోవాలని సూచించారు. దిగ్విజయ్ మాటలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. బిల్లును శాసన సభలో వ్యతిరేకించాక తాము సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామన్నారు.
డ్రామాలు: ఏరాసు
విభజనపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం డ్రామాలు ఆడుతోందని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ధ్వజమెత్తారు. రాయల తెలంగాణ అంటూ లీకులు ఇచ్చింది అధిష్టానమే అన్నారు. సీమాంధ్రలో పార్టీ తుడిచి పెట్టుకుపోయిందన్నారు. విభజనపై అధిష్టానం ఇన్ని డ్రామాలు ఆడటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications