ఆ మంత్రిపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి: సీఎం చెంతకు పంచాయితీ..
అపాయింట్మెంట్ ఖరారు కావడంతో మాణిక్యాలరావుపై వారు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏలూరు: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీ-టీడీపీ మిత్రపక్షాల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి మాణిక్యాలరావు తమను లెక్కచేయట్లేదంటూ తాడేపల్లిగూడెం మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తమ గోడు వినిపించేందుకు బుధవారం సాయంత్రం వారు చంద్రబాబుతో సమావేశం కానున్నారు. అపాయింట్మెంట్ ఖరారు కావడంతో మాణిక్యాలరావుపై వారు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.విమానాశ్రయ భూముల క్రమబద్ధీకరణ విషయంలో మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది కూడా తెలుగు తమ్ముళ్ల ఆరోపణ.

ఈ విషయాన్ని గతంలోను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకున్న పాపాన పోలేదన్న అసంతృప్తిలో వారున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే వారిలో అసంతృప్తి పెచ్చరిల్లడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి టీడీపీ కౌన్సిలర్లు దూరంగా ఉంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు వారికి ఎలా సర్దిచెబుతారో వేచి చూడాలి.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications